తెలంగాణలో ఒక్కో గ్రామపంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక్కో గ్రామపంచాయతీ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఆశిస్తుంటే.. సీఎం కేవలం రూ. 5లక్షలే మాత్రమే ఇస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ అభివృద్దికి ఐదులక్షలు ఏం సరిపోతాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. తెలంగాణ ప్రజలు పన్నుల కడతలేదా?. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారు.. కాంగ్రెస్ లో రహస్య సమవేశాలు జరుగుతున్నాయి.. త్వరలో తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బండి సంజయ్. ఇద్దరు ముగ్గురు మంత్రులు బరితెగించి అక్రమంగా సంపాదించుకుంటున్నారని, మంత్రుల అక్రమ సంపాదనపై ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా డేటా సేకరిస్తున్నాం.. అవినీతి మంత్రులు ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
