ఫంక్షన్లలో లెమన్ సోడా.. ఆరంజ్సోడా... జింజర్ సోడా.. ఇలా అనేక రకాలైన సోడా డ్రింక్ ఇస్తారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సోడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేనండి దూద్ సోడా.. అంటే పాలతో తయారు చేసిన సోడా అన్నమాట. ఈ వెరైటీ సోడా చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. . !
పార్టీలు.. ఫంక్షన్లకు ప్రతి ఒక్కరూ ఏడాదికో ఐదారు సార్లు ఎక్కడికొకచోటుకి వెళ్లక తప్పదు.. కాని కొంతమంది వీకెండ్ వచ్చిందంటే.. ఫ్రెండ్స్.. దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అందరూ కలిసి ఎంజాయి చేస్తారు. ఇక అక్కడ చికెన్..మటన్.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు లాగించేస్తారు.
దూద్ సోడా భారత్, పాకిస్థాన్‌లలోని చాలా ప్రాంతాల్లో డ్రింక్ షాపుల్లో దొరుకుతుంది. కాచి చల్లార్చిన పాలు, సోడా, చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా డ్రైఫ్రూట్స్ ను కూడా వాడుతుంటారు. ఈ డ్రింక్ తాగితే మైండ్ రీ ఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మెల్లగా కదిలిస్తే ఫిజ్ చెక్కుచెదరకుండా ఉంటుంది, దీని వలన మృదువైన, తేలికపాటి తీపి పానీయం తయారవుతుంది.
1947లో దేశ విభజన తర్వాత, దూద్ సోడా పాకిస్తాన్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది, పండుగల సమయంలో .. ఫంక్షన్లప్పుడు.. ఇంటికి ఎవరైన అతిథులు వచ్చినప్పుడు చేస్తారు. రంజాన్ సమయంలో దీనిని తరచుగా ఇఫ్తార్‌లో వడ్డిస్తారు.
ఎలా తయారుచేయాలంటే..దూద్ సోడా తయారీకి కావలసినవి
- కాచి చల్లార్చిన చల్లని పాలు :అర లీటర్
- షోడా లేదా స్ర్పైట్ : 250ఎం.ఎల్
- డ్రైఫ్రూట్ మిక్స్ : కొద్దిగా
- పంచదార పొడి: రుచికి సరిపడ
- ఐస్ (కావాలనుకుంటే): సరిపడ
తయారీ విధానం : ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రుచికి సరిపడా పంచదారను గ్రైండ్ చేసుకుని పొడి చేసుకోవాలి. పంచదార పొడిలో ఐస్ ముక్కలు ఒక స్పూన్ చొప్పున చిలికిన పాల క్రీమ్ వేసుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుని కలపాలి. ఆ తరువాత సోడా నీళ్లు, నిమ్మరసం పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.కావాలనుకుంటే సోడా నీళ్లకు బదులు స్ర్పైట్ కూడా పోసుకోవచ్చు. స్ర్పైట్ వాడితే పంచదార పొడి తగ్గించి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి తీసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్ మిక్స్ వేసుకుని తాగడమే. ఇది ఎంతో రుచిగా గొంతు దిగుతుంటే ప్రతి డ్రాప్ ఎంజాయ్ చేయొచ్చు.
