ప్రాచీన విగ్రహాలను స్వదేశానికి తీసుకొస్తాం

ప్రాచీన విగ్రహాలను స్వదేశానికి తీసుకొస్తాం

న్యూఢిల్లీ: భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని, వాటిని స్వదేశానికి రప్పించే యత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కెనడా నుంచి తెప్పించిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి అందిచేందుకు నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. కెనడాతో అనేక సంవత్సరాలు సంప్రదింపులు జరిపి అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామన్నారు. వందేళ్ల కింద దొంగతనానికి గురైన దేవి విగ్రహాన్ని తిరిగి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి అందించడం సంతోషంగా ఉందన్నారు. 

సాధు, సంతుల దీవెనలతో ప్రధాని మోడీ విదేశాల్లోని మన ప్రాచీన విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలను వెనక్కి తీసుకొస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. అందుకు మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాతా అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో నాల్రోజుల పాటు ఈ విగ్రహంతో యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విగ్రహ పునః ప్రతిష్ట జరుగుతుందన్నారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు, ఏపీ, రాజస్థాన్ ప్రభుత్వాలకు కూడా విదేశాల్లో ఉన్న విగ్రహాలు అందజేస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఆకలి తీర్చే దేవత.. వందేళ్ల తర్వాత తిరిగొచ్చింది

నేరం ఒప్పుకోలేదని యువకుడ్ని చితకబాదిన పోలీసులు

దళితబంధు అమలు చేసుకోవచ్చు