
సూర్యాపేట: దొంగతనం ఒప్పుకోనందుకు ఓ యువకుడ్ని పోలీసులు చితకబాదిన ఘటన సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది. దొంగతనం నెపంతో రెండ్రోజుల కింద ఆ యువకుడ్ని స్టేషన్‌ను తీసుకొచ్చిన ఎస్‌ఐ.. నేరం ఒప్పుకోకపోవడంతో అతడ్ని చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో యువకుడు స్టేషన్‌లోనే కుప్పకూలాడు. పరిస్థితి విషమించడంతో అతడ్ని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.