T20 World Cup: హ్యాండ్‌షేక్ ఇష్యూపై మళ్లీ వివాదం.. రేపు తెలుస్తుందన్న పాక్ కెప్టెన్

T20 World Cup: హ్యాండ్‌షేక్ ఇష్యూపై మళ్లీ వివాదం.. రేపు తెలుస్తుందన్న పాక్ కెప్టెన్

T20 World Cup: రేపు కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కి ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మరోసారి హ్యాండ్‌షేక్ అంశంపై వ్యాఖ్యలు చేసి చర్చకు దారి తీసింది. ఈ మ్యాచ్ నిజమైన క్రీడాస్ఫూర్తితో జరగాలని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. భారత జట్టు హ్యాండ్‌షేక్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ప్రశ్నకు, “రేపు తెలుస్తుంది” అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. 

కేవలం మ్యాచ్ వ్యూహాల గురించే కాకుండా, క్రికెట్ ఒకప్పుడు ఎలా ఉండేదో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా గుర్తు చేశారు. రాజకీయాల ప్రభావం లేకుండా, అభిమానులు కేవలం ఆట కోసమే చప్పట్లు కొట్టే రోజులు మళ్లీ రావాలని కోరుకున్నారు. గతంలో భారత్– పాక్ మధ్య రాజకీయ సంబంధాలు అంతగా బాగోలేని సమయంలో కూడా, ఎక్కువగా క్రికెట్ గురించే చర్చలు జరిగేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడటం వలన తమపై ఒత్తిడి మరింత పెరిగిందని సల్మాన్ అఘా అభిప్రాయపడ్డారు. 

ALSO READ :  ఢిల్లీ నుంచి శ్రీలంక టికెట్ లక్ష రూపాయలా.. మామూలు రోజుల్లో 10 మంది వెళ్లొచ్చు..!

ఇదిలా ఉండగా,  భారత క్రికెట్ జట్టు శుక్రవారం కొలంబోకు చేరుకుంది. విమానాశ్రయంలో స్థానిక కళాకారులు, బ్యాండ్, నృత్యాలతో టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆర్ష్‌దీప్ సింగ్ చేసిన డాన్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఈరోజు భారత్– పాకిస్థాన్ జట్లు వేర్వేరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. పాకిస్థాన్ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్ చేయగా, భారత్ సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సాధన చేయనుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మలపై భారత్ ఆశలు పెట్టుకుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న అబిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కనుంది. పాకిస్థాన్‌పై ఆర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.