కాంగ్రెస్ సర్కార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.ప్రజావంచన పేరుతో బీజేపీ హైదరాబాద్ లో మహధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ హయాంలో నియంత పాలన కొనసాగిందన్నారు. తెలంగాణ ప్రజల కలలన్నీ కేసీఆర్ కుటుంబానికి బలయ్యాయని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేతలు వందల హామీలు ఇచ్చారని చెప్పారు. ఏం చేశారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేస్తోందన్నారు. కాంగ్రెస గ్యారంటీలపై సీఎం చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలతో ఏ వర్ంగం బాగుపడిందో చెప్పాలని ప్రశ్నించారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీలేనని విమర్శించారు కిషన్ రెడ్డి. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి నయవంచన చేసిందన్నారు . రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ప్రజా పాలన ఉత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందో? చెప్పాలన్నారు. తెలంగాణలో ఏ రంగంలో మార్పు వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.
