కత్తిపట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కత్తిపట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఆమె వ్యవహరించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడంలో ఆమె ముందు ఉంటారు. లేటెస్టుగా ఆమె తన రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని వాటిని తిప్పుతూ డ్యాన్సు చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌లో భావ్‌నగర్‌లో జరిగిన మహిళా అభ్యుదయ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. అక్కడ వేదికపై విద్యార్థులు తల్వార్ రాస్ నృత్యం చేయడం చూసిన ఆమె.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు కత్తులు పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ వేదికపై స్టెప్పులు వేశారు. విద్యార్థులతో పాటు కలిసి వారికి అనుగుణంగా డ్యాన్స్ చేసి వారిని ఎంకరేజ్ చేశారు.