ప్రియాంక కు ఐక్యరాజ్య సమితి అవార్డ్

ప్రియాంక కు ఐక్యరాజ్య సమితి అవార్డ్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇప్పటికే పలు నేషనల్ ,ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం మరో అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకుంది. ఐక్యరాజ్య సమితి అందించే “యూనిసెఫ్‌ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి” ఎంపికైంది. బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గానూ ప్రియాంకని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాలో నటిస్తుంది. సోనాలి బోస్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ప్రియాంక ఎక్కువగా అమెరికాలోనే ఉంటోంది.