సుమారు 25 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ హార్ట్ సర్జన్ ప్రకారం మన ఆయుష్షును హరించే నాలుగు ముఖ్యమైన ఆహారాల గురించి హెచ్చరించారు. మనం రోజూ తినే ఆహారమే భవిష్యత్తులో మన ఆరోగ్యం ఎలా ఉంటుందో నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన సూచించిన ప్రమాదకర ఆహారాలు ఇవే:
1. మద్యం/ఆల్కహాల్:
ఈ లిస్టులో మద్యం అగ్రస్థానంలో ఉంది. మద్యం గుండె, లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సామాజికంగా దీనికి ఆమోదం ఉన్నప్పటికీ, ఆరోగ్య దృష్ట్యా ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
2. ప్రాసెస్ చేసిన మాంసం:
హాట్ డాగ్‌లు, బేకన్, ప్యాక్ చేసిన మాంస పదార్థాలు తినడానికి రుచిగా, సౌకర్యంగా ఉండవచ్చు. కానీ వీటిలో ఉండే రసాయనాలు, అధిక ఉప్పు దీర్ఘకాలంలో గుండె జబ్బులకు, క్యాన్సర్‌కు దారితీస్తాయి.
3. చక్కెర పానీయాలు:
వీటిని పనికిరాని కేలరీలు అని చెబుతుండగా... ఇవి తాగినప్పుడు కడుపు నిండిన భావన కలగదు, కానీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచి బరువు పెరగడానికి, మధుమేహానికి కారణమవుతాయి.
4. సంతృప్త కొవ్వులు:
వెన్న, నెయ్యి, అధిక కొవ్వు ఉన్న పాలు, మాంస ఉత్పత్తుల్లో ఇవి ఉంటాయి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
లిమిట్ గా ఉండటమే మంచిది
డాక్టర్ ప్రకారం ఏ ఆహారాన్ని పూర్తిగా మానేయమని చెప్పలేదు. కానీ ఆయన 80/20 సూత్రాన్ని అనుసరించమని చెప్పారు. అంటే 80 శాతం సమయం ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, మిగిలిన 20 శాతం కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టమైనవి లిమిట్లో తీసుకోవచ్చు.
ఆయన చెప్పిన ఒక గొప్ప విష్యం ఏంటంటే మీరు ఆరోగ్యం కోసం సమయం కేటాయించుకోవాలి, లేదంటే భవిష్యత్తులో అనారోగ్యం కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది అని అన్నారు.
పూర్తిగా ఆహార నియమాలు పాటించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఈ నాలుగు పదార్థాలను మన ఆహారంలో లేకుండా చూసుకుంటే ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు. మంచి అలవాట్లు, అవగాహనే మనల్ని రక్షిస్తాయి.

