దేశంలోనే హైదరాబాద్ యూనివర్సిటీకి బెస్ట్ ర్యాంక్

దేశంలోనే హైదరాబాద్ యూనివర్సిటీకి బెస్ట్ ర్యాంక్

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్ (UoH) అరుదైన ఘనతను సాధించింది. దేశంలోని 80 మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీలతో పాటు స్టేట్, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలపై వీక్ హన్సా బెస్ట్ ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో సౌత్ ఇండియాలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. అలాగే దేశంలోని టాప్ యూనివర్సిటీల లిస్టులో ఐదో ప్లేస్ ను దక్కించుకుంది. వయస్సు, అక్రిడేషన్, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, రీసెర్చ్, విద్యార్థులు, అకడమిక్స్, ప్లేస్ మెంట్స్ తదితర అంశాల ప్రాతిపదికన ఈ సర్వేను చేపట్టారు. ఈ సర్వే ఫలితాలను వీక్ మ్యాగజీన్ లో ప్రచురించారు.