జెట్ ఎయిర్‌వేస్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో సోమవారం నుండి జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు విమానాలు నడిపేది లేదని 1,000 మందికి పైగా స్పష్టం చేశారు. జీతాలపై కంపెని ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(NAG) స్పష్టం చేసింది. మార్చి 29 కల్లా SBI నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం. కానీ దురదృష్టవశాత్తు నిధుల బదిలీ జరగలేదు. అంతేగాక.. పైలట్ల జీతాల చెల్లింపులపై యాజామాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి విమానాలు నడపబోమని నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్ చోప్రా తెలిపారు.
