అన్‌సీడెడ్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా అద్భుతం చేసింది. డబుల్స్ ప్లేయర్‌గా ముద్రపడ్డ పాతికేళ్ల చెక్ భామ సింగిల్స్‌లో సంచలనం సృష్టించింది..! వయసు తక్కువే అయినా.. తగినంత అనుభవం లేకున్నా.. ఇప్పటిదాకా ఆడింది ఐదు గ్రాండ్స్లామ్సే అయినా.. ఫ్రెంచ్ఓపెన్ విమెన్స్ టైటిల్ నెగ్గి ఔరా అనిపించింది..! 52 గ్రాండ్‌స్లామ్స్ ఆడిన అనుభవం ఉన్న 29 ఏళ్ల రష్యా స్టార్ పవ్లుచెంకోవాకు తుది పోరులో చెక్‌పెట్టి ఫ్రెంచ్ కోటలో కొత్త క్వీన్‌గా నిలిచింది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్‌లో వరుసగా ఆరోసారి కొత్త ప్లేయర్ విజేతగా నిలిచింది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా తన కెరీర్లో తొలిసారి ఓ
గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 33వ ర్యాంకర్ క్రెజికోవా 6–1, 2–6, 6–4తో 31వ సీడ్ అనస్తేసియా పవ్లుచెంకోవాపై అద్భుత విజయం సాధించింది. 2000 తర్వాత ఈ మెగా టోర్నీలో ఒకే ఏడాది సింగిల్స్‌తో పాటు డబుల్స్ టైటిల్నెగ్గిన తొలి ప్లేయర్‌గా నిలిచేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. తన పార్ట్నర్ కేథరినా సినైకోవాతో కలిసి ఆదివారం విమెన్స్డబుల్స్ ఫైనల్లో పోటీ పడనుంది. మరోవైపు 52వ ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్చేరిన రష్యా ప్లేయర్పవ్లుచెంకోవా టైటిల్ అందుకోలేకపోయింది. ఎడమ కాలు గాయంతో ఇబ్బందిపడ్డ ఆమె సెకండ్సెట్లో ట్రీట్మెంట్తీసుకుంది. తర్వాత ఆట కొనసాగించినా క్రెజికోవా జోరు ముందు తేలిపోయింది.
బార్బోరా జోరు..
ఫస్ట్ టైమ్ఫైనల్కు వచ్చిన బార్బోరా, పవ్లుచెంకోవా మధ్య పోటీ జోరుగానే సాగింది. తొలి గేమ్‌లోనే పవ్లుచెంకోవా బ్రేక్ పాయింట్సాధించింది. కానీ, 2,4,6వ గేమ్స్‌లో ఆమె సర్వీస్ బ్రేక్ చేసిన క్రెజికోవా ఈజీగా తొలి సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్లో రష్యా ప్లేయర్ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా మూడు బ్రేక్పాయింట్లతో సెట్ గెలిచి స్కోరు సమం చేసింది. మూడో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. చెరో గేమ్ నెగ్గుతూ వెళ్లడంతో 1–1, 2–2, 3– 3గా సాగింది. అయితే, ఏడో గేమ్‌లో ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో బ్రేక్సాధించిన క్రెజికోవా ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌లో సర్వీస్ నిలుపుకున్న పవ్లుచెంకోవా 4–5తో రేసులోకి వచ్చింది. కానీ, ఆమెకు మరో చాన్స్ఇవ్వని క్రెజికోవా తాను సర్వ్ చేసిన పదో గేమ్‌లో మ్యాచ్ పాయింట్నెగ్గింది.