అన్స్టాపబుల్ అంటూ వచ్చేస్తున్న వీజే సన్నీ

అన్స్టాపబుల్ అంటూ వచ్చేస్తున్న వీజే సన్నీ

తన అభిమాన హీరో బాలయ్య బాబుపై బిగ్ బాస్-5 విన్నర్ వీజే సన్నీ అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా తన చిత్రానికి బాలకృష్ణ ఓటిటి ప్రోగ్రామ్ అన్ స్టాపబుల్ పేరును ఫిక్స్ చేశాడు. ఈ మేరకు మూవీని అనౌన్స్ చేశాడు.  హైదరాబాద్లో  అన్స్టాపబుల్ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూవీ షూటింగ్ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. పోస్టర్లో వీజే సన్నీ స్టన్నింగ్  లుక్లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ సినిమాకు డైమాండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రత్నబాబు రీసెంట్ గా  సన్నాఫ్ ఇండియా ' మూవీని డైరెక్టర్ చేశాడు. గతంలో అతను సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం,ఈడోరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు మాటలు అందించారు. ప్రస్తుతం అన్స్టాపబుల్ మూవీని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేవిధంగా తీయనున్నట్లు తెలుస్తోంది. 

రిపోర్టర్ నుంచి..హీరోగా..
వీజే సన్నీ..మొదట్లో ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వీజేగా మారి.. సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ -5 అతను లైఫ్ను టర్న్ చేసింది. అందులో విజేతగా నిలవడంతో..సన్నీకి ఒక్కసారి క్రేజ్ పెరిగింది. దీంతో హీరోగా సన్నీ సకల గుణాభిరామ సినిమాలో యాక్ట్ చేశాడు. ఇది త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. త్వరలో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.