అసలు వాడు మగాడే కాదు.. తాళి కట్టిన తర్వాత పెళ్లి మండపంలో ఏం జరిగింది..!

అసలు వాడు మగాడే కాదు.. తాళి కట్టిన తర్వాత పెళ్లి మండపంలో ఏం జరిగింది..!

పెళ్లి ఘనంగా జరిగింది.. ఊరేగింపు అంతకంటే గ్రాండ్ గా.. ఊరంతా వచ్చారు.. బంధువులు, చుట్టాలు ఇలా ధూంధాంగా పెళ్లి జరిగింది. జస్ట్ పెళ్లి తంతు అంతా అలా ముగిసింది.. అందరూ భోజనాలు చేస్తున్నారు.. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో పెళ్లి మండపంలో హడావిడి.. హంగామా.. ఏంటా అని చూస్తే.. పెళ్లి కొడుకు మగాడు కాదు.. ట్రాన్స్ జండర్.. అబ్బాయిగా మారిన అమ్మాయి.. పెళ్లి కూతురుకి మైండ్ బ్లాంక్.. తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు.. ఆ వెంటనే పోలీసులు ఎంట్రీ.. యూపీలో జరిగిన ఈ షాకింగ్ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలోని బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. పెళ్లికి ముందు రోజు రాత్రంతా ఊరేగింపు గ్రాండ్ గా జరిగింది. తెల్లవారి కల్యాణమండపంలో కాసేపట్లో పెళ్లి జరగబోతోంది అనగా.. వధువు కుటుంబంలో గందరగోళం నెలకొంది. పెళ్ళికొడుకు మగాడు కాదు.. అబ్బాయిగా మారిన అమ్మాయి అని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలీని స్థితిలోకి వెళ్లిపోయారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో సీన్లోకి పోలీసులు ఎంటరవ్వాల్సి వచ్చింది. 

ఈ ఘటనతో షాక్ కి గురైన బంధువులు, అతిధులు ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపోయారు. నిజాన్ని దాచి తమ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారా అంటూ పెళ్ళికొడుకు పేరెంట్స్ ను నిలదీశారు వధువు తల్లిదండ్రులు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇరు వర్గాలతో మాట్లాడి పెళ్ళి ఆపేసి సమస్యను పరిష్కరించారు పోలీసులు.

ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు పోలీసులు. ఆచారం ప్రకారం గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకునే సమయంలో సాంప్రదాయ కళాకారుల బృందం వరుడు అబ్బాయి కాదని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటన అటు స్థానికంగా.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.