మమ్మల్ని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయండి.. మైనారిటీ రెసిడెన్షియల్ హిందీ టీచర్ల విజ్ఞప్తి

మమ్మల్ని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయండి.. మైనారిటీ రెసిడెన్షియల్ హిందీ టీచర్ల విజ్ఞప్తి

అబిడ్స్, వెలుగు: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)గా విధులు నిర్వహిస్తున్న తమను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)గా అప్​గ్రేడ్​ చేయాలని హిందీ టీచర్లు కోరారు. మంగళవారం నాంపల్లిలోని మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీచర్లు బాబా షరీఫ్, ఖాన్నీస ఫాతిమా మాట్లాడుతూ.. 2018లో టీజీపీఎస్సీ ద్వారా తాము టీజీటీలుగా రిక్రూట్ అయ్యామని తెలిపారు. 

సాధారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో టీజీటీలు 5 నుంచి 7 తరగతులకు, పీజీటీలు 8 నుంచి 10 తరగతులకు బోధిస్తారని, కానీ హిందీ విషయంలో మాత్రం 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కరే బోధించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేండ్లుగా హిందీలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నా తమ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదన్నారు. తమను పీజీటీలుగా అప్​గ్రేడ్ చేయకపోతే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనల ప్రకారం కేవలం 7వ తరగతి వరకే బోధిస్తామని స్పష్టం చేశారు.