V6 News

మోడీ ఇంద్రజాలం చేస్తున్నారు : రాహుల్ వ్యాఖ్యలపై సభలో రభస

మోడీ ఇంద్రజాలం చేస్తున్నారు : రాహుల్ వ్యాఖ్యలపై సభలో రభస

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్ సభలో జరుగుతున్న చర్చ గందరగోళంగా మారింది. 2023లోనే సభలో ఆమోదం తెలిపిన మహిళా రిజర్వేషన్ బిల్లును.. మళ్లీ తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోడీ ఇంజ్రాలకుడిగా.. దేశాన్ని మేజిక్ చేస్తున్నారంటూ ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ అంటూ హడావిడి చేసి.. అమెరికా ఆదేశాలతో యుద్ధం ఆపేశారంటూ కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. 

బాలాకోట్ లో సైనికులు చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని.. నోట్ల రద్దు, జీఎస్టీ నెగెటివ్ ఫలితాలు ఇచ్చినా.. ప్రధాని మోడీ మేజీషియన్ లా దేశాన్ని కప్పి పుచ్చుతున్నారన్నారు రాహుల్ గాంధీ.

►ALSO READ | ఇది మహిళా బిల్లు కాదు.. యాంటి నేషనల్ యాక్ట్ బిల్లు: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ సభలో డిమాండ్ చేసింది. ప్రధాని మోడీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. దేశ ప్రజలను అవమానించటం తగదంటూ బీజేపీ వాదించింది.