V6 News

ఇది మహిళా బిల్లు కాదు.. యాంటి నేషనల్ యాక్ట్ బిల్లు: రాహుల్ గాంధీ

ఇది మహిళా బిల్లు కాదు.. యాంటి నేషనల్ యాక్ట్ బిల్లు: రాహుల్ గాంధీ

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్ హాట్ గా చర్చ సాగింది.  మహిళ రిజర్వేషన్ బిల్లుపై  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బిల్లు మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన బిల్లు కాదు.. యాంటీ నేషనల్ యాక్ట్ బిల్లు అని విమర్శించారు. 2023లో లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు అసలైనదన్నారు.మూడు బిల్లులను కలిపి తీసుకురావడం సిగ్గుచేటన్నారు.ఈ బిల్లులతో ఓబీసీ, మైనార్టీలలను అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. రాజ్యంగంపైస మనువాదాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు బిల్లులను కలిపి తీసుకురావడం సిగ్గు చేట్టన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్, నార్త్, చిన్న రాష్ట్రాలకు నష్టం జరగనివ్వమని అన్నారు రాహుల్ గాంధీ. 

ఓట్లకోసం బీజేపీకి ఓబీసీ, ఆదివాసీలు ఎస్సీలు కావాలి.. ఎన్నికల జిమ్మిక్కు కోసమే మహిళా బిల్లును  తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాజ్యాంగం కంటే మనువాదానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు రాహుల్. 

►ALSO READ | పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ.. నేనేమైనా క్రిమినల్ నా అంటూ ఖేరా ఆవేదన

ఈ బిల్లులతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కులను లాక్కుంటున్నారని రాహుల్  మండిపడ్డారు. ఈ బిల్లులతో సెంట్రల్ లో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. మహిళా బిల్లుకు ప్రతి ఒక్క విపక్ష నేత మద్దతు నిస్తారు..2023లో ఆమోదం పొందిన మహిళ బిల్లును వెంటనే అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.