FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ 96 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం అమల్లోకి రానుంది. జులై 19న న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ విజేతలకు ఐకానిక్ ట్రోఫీతో పాటు గోల్డ్ మెడల్స్, ప్రత్యేకంగా రూపొందించిన ఛాంపియన్‌షిప్ రింగ్స్ (Championship Rings) ను బహుకరించనున్నారు. ఫిఫా నిర్వహించే ఒక అధికారిక టోర్నమెంట్‌లో ఇలాంటి అరుదైన గౌరవాన్ని కల్పించడం ఇదే మొట్టమొదటిసారి. అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ (NBA, NFL, MLB) లలో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాన్ని స్ఫూర్తిగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ వేదికపైకి ఫిఫా పరిచయం చేస్తోంది.
రింగుల ప్రత్యేక డిజైన్.. ఫ్యాన్స్‌కు కూడా ఛాన్స్:
ఈ మెగా టోర్నమెంట్‌ను చిరస్మరణీయం చేసేందుకు గానూ మొత్తం 2,026 పరిమిత ఎడిషన్ (Limited Edition) రింగులను మాత్రమే నంబర్ల వారీగా తయారు చేస్తున్నారు. ఇందులో కేవలం 30 రింగులను మాత్రమే విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కోసం రిజర్వ్ చేయనున్నారు. మిగిలిన 1,996 రింగులను అఫీషియల్ లైసెన్స్డ్ కలెక్టబుల్స్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ రింగుల డిజైన్:
ఈ రింగ్‌లకు ఒక వైపు ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ముద్రించబడి ఉంటుంది. మరోవైపు విజేతగా నిలిచిన దేశపు ప్రత్యేక గుర్తింపుని ప్రతిబింబించేలా కస్టమైజ్ చేస్తారు. మ్యాచ్ ముగిసిన వెంటనే వేడుకల సమయంలో విజేత జట్టు కెప్టెన్, హెడ్ కోచ్‌లకు తాత్కాలిక రింగులను అందజేస్తారు. ఆ తర్వాత ఆటగాళ్లందరి వేలి కొలతలకు సరిపోయేలా శాశ్వతమైన రింగులను ప్రత్యేకంగా తయారు చేసి అథెంటిసిటీ సర్టిఫికెట్‌తో సహా అధికారికంగా అందజేయనున్నారు.
అర్జెంటీనా, స్పెయిన్ ప్రదర్శన:
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 2–1 తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ వెనుకబడినప్పటికీ.. ఎంజో ఫెర్నాండెజ్ అందించిన ఈక్వలైజర్, ఆపై స్టాపేజ్ టైమ్‌లో లౌటారో మార్టినెజ్ సృష్టించిన గోల్ మ్యాజిక్‌తో అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. తద్వారా 1966 తర్వాత తొలిసారి ఫైనల్ చేరాలనే ఇంగ్లాండ్ కలలను బ్రేక్ చేసింది.
ALSO READ : ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీకి టాప్ సెలబ్రిటీలు..
మరోవైపు యూరోపియన్ కింగ్స్ స్పెయిన్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టును 2–0తో మట్టికరిపించి ఏకపక్షంగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యువ సంచలనం లామిన్ యమల్ రాణించడంతో లభించిన పెనాల్టీని మైకెల్ ఒయార్జబల్ గోల్‌గా మల్చగా, ఆ తర్వాత పెడ్రో పోర్రో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 6 క్లీన్ షీట్లు నమోదు చేసిన అజేయమైన డిఫెన్స్‌తో స్పెయిన్.. 2010 టైటిల్ విజయం తర్వాత మళ్లీ ఇప్పుడు చరిత్రలో రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
FIFA World Cup 2026 winners(🇦🇷Argentina or Spain🇪🇸) to receive historic first championship rings. 💍🏆
— MR CPᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@Nedu600) July 17, 2026
Limited-edition collection of 2,026 rings, with 30 reserved for the winners and 1,996 available to fans worldwide for purchase. pic.twitter.com/pNgaAcRgBt
I present to you, the official FIFA world cup trophy.... ✨️✨️✨️ pic.twitter.com/iK9XKRB25Z
— 🦋 Bel Papiyon 🦋 (@reignofglitter) July 16, 2026
