V6 News

పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ.. నేనేమైనా క్రిమినల్ నా అంటూ ఖేరా ఆవేదన

పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ.. నేనేమైనా క్రిమినల్ నా అంటూ ఖేరా ఆవేదన

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు మరోసారి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం సీఎం హిమంత బిష్వ శర్మ సతీమణి వేసిన పరువు నష్టం కేసులో.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన  బెయిల్ ను సుప్రీం కోర్టు రెండో సారి నిలిపివేసింది. 

తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను మంగళవారం (ఏప్రిల్ 21) వరకు కొనసాగించాల్సిదిగా చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అస్సాం కోర్టులకు సెలవు దినాల కారణంగా బెయిల్ ను కొనసాగించాలని పిటిషన్ వేశారు. ఖేరా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అస్సాం కోర్టులోనే తేల్చుకోవాలసి సూచించింది.

సుప్రీంకోర్టు బెయిల్ కొనసాగింపుపై స్టే విధించడంపై ఖేరా ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ కొనసాగించకపోవడానికి తానేమైనా క్రిమినల్ నా అంటూ ప్రశ్నించారు. ఖేరా తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ మాట్లాడుతూ.. ఇవాళ శుక్రవారం (ఏప్రిల్ 17). అస్సాం కోర్టులో పిటిషన్ సోమవారం (ఏప్రిల్ 20) ఫైల్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో సెలవులు ఉన్నందున బెయిల్ కొనసాగింపు అడుగుతున్నాం. పవన్ ఖేరా ఏమైనా పేరుమోసిన క్రిమినల్ నా.. బెయిల్ కొనసాగించకపోవడానికి.. అంటూ ఖేరా తరఫున అడ్వకేట్ సింఘ్వీ ప్రశ్నించారు.  

  •  ఏంటి వివాదం?

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రినికి భూయాన్‎కు మూడు పాస్ట్ పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. పవన్ ఖేరా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రినికి భూయాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

►ALSO READ | తెలంగాణను కించపరుస్తుంటే మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నారు..?: ప్రొఫెసర్ కోదండరాం

గౌహతిలో నమోదైన కేసులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేత పవన్‌‌‌‌‌‌‌‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేసు నమోదైన అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్‌‌‌‌‌‌‌‌ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌహతిలో నమోదైన కేసులో అరెస్ట్‌‌‌‌‌‌‌‌ అవకాశాలున్నాయని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయలని కోరుతూ పవన్‌‌‌‌‌‌‌‌ ఖేరా హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు.