V6 News

తెలంగాణను కించపరుస్తుంటే మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నారు..?: ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణను కించపరుస్తుంటే మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నారు..?: ప్రొఫెసర్ కోదండరాం


బీజేపీ ఎంపీ తేజస్వీ యాదవ్ ఇంగితం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు ప్రొఫెసర్ కోదండరాం. తేజస్వీ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తేజస్వీ మాటలను తెలంగాణ బీజేపీ నేతలు సమర్థించడం దుర్మార్గమని మండిపడ్డారు. 2026 ఏప్రిల్ 17న టీజేఎస్ కార్యాలయంలో మాట్లాడిన కోదండరాం.. తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణపై బీజేపీ నేతలు తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని అన్నారు ప్రొఫెసర్. తమ కళ్ల ముందే తెలంగాణను కించ పరుస్తుంటే మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. గతంలో మోదీ, అమిత్ షా కూడా తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు.

ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. తేజస్వీ మాటలు చాలా బాధ కలిగించాయని.. బాధ అనే పదం చాలా చిన్నగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని అన్నారు. ఏ రాష్ట్ర ఏర్పాటైనా ఆర్టికల్ 3 ప్రకారమే జరుగుతుందని.. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

తెలంగాణను బీజేపీ నేతలు కించపరచడం ఇది మొదటి సారి కాదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తేజస్వీ వివాదాస్ప వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదాస్ప వ్యాఖ్యలు తొలగించాలని సభ స్పీకర్ ను కోరుతున్నట్లు చెప్పారు.