కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ 746 ను ఢీకొన్న బైకు.. ఇద్దరు స్పాట్ డెడ్

కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం..  మెట్రో పిల్లర్ 746 ను ఢీకొన్న బైకు.. ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ యాక్సిడెంట్ లో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు.   టీ.ఎస్ 02 సీ 6919 నెంబర్ బైక్ పై ఓవర్ స్పీడుతో వచ్చిన ఇద్దరు యువకులు మెట్రో పిల్లర్ 746 కు ఢీకొట్టారు. 

ఈ ఘటనలో  ఇద్దరు యువకులు అక్కడికక్కడే  మృతి చెందారు. డ్యూక్ బైక్ తీవ్రంగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రిశీలించారు. యాక్సిడెంట్కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.  

ALSO READ : KPHB ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్ ఎదుట గొడవ

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు అఖిలేష్ యాదవ్ తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.