జార్ఖండ్ లో దారుణం జరిగింది. స్కూల్లో డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా 10వ తరగతి విద్యార్థిని కట్టేసి బట్టలిప్పి దారుణంగా కొట్టారు తోటి విద్యార్థులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఈ ఘటన జూలై 14వ తేదీ రాత్రి జరిగినట్లు తెలుస్తోంది, గురువారం ( జులై 16 ) బాధితుడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
బాధితుడిని కట్టేసి దారుణంగా కొట్టడమే కాకుండా నిందితులు ఈ దాడిని మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. అది వైరల్ అయిందని పోలీసులు తెలిపారు.
హాస్టల్‌లో ఆరుగురు తోటి విద్యార్థులు తమ కుమారుడిని కట్టేసి, బట్టలు విప్పేసి, బెల్టులతో కొట్టారని బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితులు బెదిరించారని కూడా వారు ఆరోపించారు.
"మొబైల్ ఫోన్ ద్వారా జరిగిన లావాదేవీ విషయంలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం హింసకు దారితీసిందని... బాధితుడి చేతులు కట్టేసి, బట్టలు విప్పేసి, బెల్టులతో కొట్టారని తెలిపారు పోలీసులు.
ALSO READ : కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం..
తమ కుమారుడు భయంతో రెండు రోజుల పాటు దాడి గురించి మౌనంగా ఉన్నాడని... నొప్పి భరించలేక, అతని పరిస్థితి విషమించిన తర్వాతే తమకు విషయం చెప్పాడని బాధితుడి పేరెంట్స్ అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే స్కూల్ కి వెళ్లి బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు పేరెంట్స్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
