ఆస్కార్ అవార్డు విన్నర్, దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు క్రిస్టోఫర్. ఇపుడీ ఈ దర్శక దిగ్గజం తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey). భారీ అంచనాల మధ్య శుక్రవారం (జులై17, 2026న) భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూర్తిగా IMAX కెమెరాలతో తెరకెక్కిన తొలి ఫీచర్ ఫిల్మ్ అవ్వడంతో తెలుగు సినీ ఆడియన్స్ సైతం బుకింగ్స్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్తో పాటు ఇండియాలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో సినీ ఫ్యాన్స్ ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నోలన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటని, విజువల్స్, టెక్నికల్ వర్క్, ఎమోషనల్ ట్రీట్‌మెంట్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు.
కథేంటంటే:
ఈ సినిమా ‘ది ఇలియడ్’ (ట్రోజన్ యుద్ధం కథ)కు కొనసాగింపు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడైన ఒడిస్సియస్, తన స్వదేశమైన ‘ఇథాకా’ రాజ్యానికి తిరిగి రావడానికి పడ్డ 10 సంవత్సరాల కష్టాలు, సముద్ర ప్రయాణంలో ఎదురైన భయంకరమైన రాక్షసులు, వాటన్నింటినీ అతను తన తెలివితేటలతో ఎలా అధిగమించాడనేదే ఈ అద్భుతమైన కథ.
కథగా చెప్పుకుంటే, ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత అందరు హీరోలు హ్యాపీగా ఇంటికి చేరుకుంటే, మన హీరో ఒడిస్సియస్ మాత్రం దారి తప్పి సముద్రాల పాలు అవుతాడు. సముద్ర దేవుడి శాపం వల్ల పదేళ్ల పాటు రాక్షసులు, మంత్రగత్తెలు, సుడిగుండాల మధ్య నలిగిపోతాడు. ఇటు సొంత రాజ్యంలో అతని భార్యాపిల్లలను శత్రువులు వేధిస్తుంటారు. ఈ పదేళ్ల నరకం దాటుకుని, ఒడిస్సియస్ తన భార్యను, రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ కథ.
ఎలా ఉందంటే:
సాధారణంగా పాతకాలపు కథల్లో హీరోలు కేవలం శారీరక బలంతో విలన్లను రక్తం కారేలా కొడతారు. కానీ ఒడిస్సియస్ అలా కాదు. అతను కేవలం కండబలంతో కాకుండా బుద్ధిబలం (Metis) తో గెలుస్తాడు. ఉదాహరణకు.. ఒకే కన్నున్న రాక్షసుడు సైక్లోప్స్‌ను గుడ్డివాడిని చేసి, తన పేరు ‘ఎవరూ లేరు’ అని చెప్పి తప్పించుకునే సీన్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో ఉంటుంది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే హోమర్ సృష్టించిన రాక్షసులు (సైక్లోప్స్), పాటలతో చంపే సైరన్లు, ఆరు తలల రాక్షసి సిల్లా.. ఇవన్నీ ఇప్పటి ‘అవతార్’ లేదా ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు. ముఖ్యంగా ఇంటికి వెళ్లాలనే తపన, భర్త కోసం ఇరవై ఏళ్లు వేచి చూసిన భార్య విశ్వాసం, తండ్రి కోసం వెతికే కొడుకు తపన.. ఇలాంటి బలమైన ఎమోషన్స్ వల్ల ఈ కథ మరింత ఆకట్టుకుంటుంది.
ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే:
చాలా మంది ప్రేక్షకులు ‘ది ఒడిస్సీ’ నోలన్ గత చిత్రాలు ‘ఓపెన్‌హైమర’, ‘టెనెట్’ కంటే మరింత గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
ఓ నెటిజన్ ఎక్స్‌లో స్పందిస్తూ..‘‘ది ఒడిస్సీ ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవం. మొదటి 30 నిమిషాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ఒడిస్సియస్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత సినిమా పూర్తిగా ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు హారర్ సినిమాను తలపిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు పక్కా కమర్షియల్ మూవీ తరహాలో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్లో చూస్తేనే విజువల్ ఫీల్ వస్తుంది. ఈ కథలోని ముఖ్యమైన పాత్రల అయిన ట్రాయ్, ట్రోజన్ వార్ గురించి ముందుగా కొంత తెలుసుకుని వెళ్తే సినిమా అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చూడండి!’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ : అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సం
#TheOdyssey Technically Brilliant, A True Cinematic Experience!
— Venky Reviews (@venkyreviews) July 17, 2026
The first 30 minutes takes time to get going, but once Odysseus’ journey back begins, the film is exhilarating. Some sequences genuinely feel like a horror movie, while others play out like a proper commercial film.…
మరో నెటిజన్ రివ్యూ ఇస్తూ..ఇది ధైర్యం, సాహసం నిండిన అద్భుతమైన సినీమాటిక్ అనుభవమని పేర్కొన్నారు. ‘‘నోలన్ మరోసారి తన ప్రత్యేకమైన కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, ‘ఓపెన్‌హైమర్’ (2023), ‘టెనెట్’ (2020) చిత్రాల కంటే మరింత గొప్పగా ఆలోచింపజేసే ఫాంటసీ, అడ్వెంచర్, డ్రామా అంశాలతో ‘ది ఒడిస్సీ’ని రూపొందించారని ప్రశంసించారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, ఉత్సాహంగా స్పందిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా తరతరాలకు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.
#TheOdysseyReview :- CINEMATIC MARVEL of Courage and Bravery 🔥
— Manoz Kumar (@ManozTalks) July 16, 2026
Rating :~ ⭐⭐⭐⭐✨ [4.5/5]
Director #ChristopherNolan does it again and how 🔥
WONDER , how this Guy has able to deliver everytime, and this time he has delivered BEYOND Oppenheimer (2023) and at par or… pic.twitter.com/dy1EkdA4hc
ఇక ప్రధాన పాత్రలో నటించిన మ్యాట్ డామన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటన ఇచ్చారని, ఒడిస్సియస్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసలు అందుతున్నాయి. తెరపై ఆయన కనిపించే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. అలాగే టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో మెప్పించారని, ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉందని కామెంట్ చేశాడు. మొత్తంగా ‘ది ఒడిస్సీ’ క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లో మరో మైలురాయి చిత్రంగా నిలిచిపోతుందని, ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలని’’ ట్వీట్ చేశాడు.
