కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌ల జాబితాపై యూపీఎస్సీ తీవ్ర అభ్యంతరం

కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌ల జాబితాపై యూపీఎస్సీ తీవ్ర అభ్యంతరం

కేసులు ఉన్నోళ్ల పేర్లు ఎట్ల పంపుతరు?
కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌ల జాబితాపై యూపీఎస్సీ తీవ్ర అభ్యంతరం
తూతూమంత్రంగా వివరాలు పంపడం కాదు
సర్వీస్, రిమార్క్స్‌‌ వంటి అంశాలన్నీ ఇవ్వాలంటూ లిస్ట్​ వెనక్కి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పంపిన కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్‌‌ల జాబితాలను యూపీఎస్సీ వెనక్కి పంపింది. డిప్యూటీ కలెక్టర్లను ఐఏఎస్‌‌లుగా ప్రమోట్ చేయడానికి ఇచ్చిన లిస్ట్ సరిగ్గా లేదని పేర్కొన్నది. ఏదో తూతూమంత్రంగా వివరాలు పంపడం కాదని.. సమగ్రంగా నివేదించాలని స్పష్టం చేసింది. సదరు ఆఫీసర్ల సర్వీస్, సీనియారిటీతో పాటు వారిపై ఎలాంటి రిమార్క్స్ ఉన్నాయనేది తెలియజేయాలని ఆదేశించింది. కన్ఫర్డ్ ఐపీఎస్‌‌ల లిస్ట్ విషయంలోనూ సరైన పద్ధతి పాటించలేదని యూపీఎస్సీ సీరియస్ అయింది. కొన్ని కేసుల్లో ఉన్న వారి పేర్లను జాబితాలో పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్‌‌ల కోసం పంపిన లిస్టులపై క్లారిఫికేషన్ కోరుతూ రాష్ట్ర సర్కార్‌‌‌‌కు తిరిగి పంపింది.

నయీమ్ కేసులో ఉన్న డీఎస్పీ పేరు కూడా..

సాధారణంగా రెవెన్యూ.. నాన్ రెవెన్యూ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్‌‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఒక జాబితాను కేంద్రంలోని యూపీఎస్సీకి పంపుతుంది. రెవెన్యూ సర్వీస్ నుంచి వేరుగా, నాన్ రెవెన్యూ నుంచి వేరుగా రెండు జాబితాలు అందజేస్తుంది. ఇందులో గ్రూప్ 1 ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన డిప్యూటీ కలెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ లిస్టును యూపీఎస్సీ పరిశీలించి, కన్ఫర్డ్ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా అర్హత ఉన్న వాళ్లకు ప్రమోషన్ కల్పిస్తుంది. ఇటీవల యూపీఎస్సీకి పంపిన జాబితాలో రెవెన్యూ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినది ఉన్నది. ఇందులో ఐదుగురి పేర్లు ఉన్నాయి. చంద్రశేఖర్, ప్రియాంక, శ్రీవాత్సవ, అరుణ శ్రీతో పాటు మరొకరి పేరు ఉంది.  

యూపీఎస్సీకి పంపే జాబితాలో ఏ సంవత్సరం రిక్రూట్ అయ్యారు? ఎక్కడెక్కడ, ఏ హోదాల్లో పనిచేశారు? సీనియారిటీ ఎంత? పనితీరు ఎలా ఉంది? సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏమైనా ఆరోపణలు ఎదుర్కొన్నారా? విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఏసీబీ, ఇతర డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ కేసులు ఏమైనా ఉన్నాయా? వంటి వివరాలను సమగ్రంగా పొందుపర్చాలి. ఇందులో కొన్నింటిని ప్రస్తావించకుండానే రాష్ట్ర సర్కార్ యూపీఎస్సీకి జాబితా పంపినట్లు తెలిసింది. దీంతో కొన్ని అంశాలను లేవనెత్తిన యూపీఎస్సీ.. వాటికి తగిన సమాచారం జోడించి పంపాలని స్పష్టం చేసింది. కన్ఫర్డ్ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లిస్టు విషయం లోనూ యూపీఎస్సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నయీమ్ కేసులో ఉన్న ఒక డీఎస్పీ పేరును కన్ఫర్డ్ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పంపడంపై తీవ్రంగా స్పందించింది. ఇంకొకరి పేరుపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర సర్కార్ తమకు కావాల్సిన వారికి కన్ఫర్డ్ ఇప్పించేందుకే కొన్ని విషయాలను యూపీఎస్సీ దగ్గర దాస్తున్నదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. 

నాన్ రెవెన్యూ లిస్టుపై తర్జనభర్జన

మరోవైపు నాన్ రెవెన్యూ నుంచి కన్ఫర్డ్ ఐఏ ఎస్ జాబితా తయారీపై తర్జనభర్జనలు పడు తున్నారు. మంత్రుల దగ్గర పనిచేస్తున్న ఇద్ద రు పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వీళ్లపైనా కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటిదాకా దాదాపు వంద మం ది అప్లై చేసుకున్నట్లు సమాచారం. దీనికి ఇం టర్వ్యూలు తీసుకుని సీనియారిటీ, సర్వీస్ ఆధారంగా రాష్ట్ర సర్కార్ లిస్ట్ ఫైనల్ చేసి యూపీఎస్సీకి పంపాల్సి ఉంటుంది. ఇందులోనూ ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా పనిచేస్తున్న వారినే ఫైనల్ చేసేలా పావులు కదుపుతున్నారని తెలిసింది.