హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు 60 రోజుల గ్రేస్ పీరియడ్

హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు 60 రోజుల గ్రేస్ పీరియడ్
  • కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

వాషింగ్టన్ : అమెరికాలోని హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు, గ్రీన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి గుడ్ న్యూస్. వీరందరికీ రెండు నెలల పాటు గ్రేస్ పీరియడ్ ఇస్తూ అమెరికా కీలక నిర్ణయంతో తీసుకుంది. దీంతో జూన్ నాటికి లీగల్ స్టేటస్ కోల్పోనున్న దాదాపు 2 లక్షల మందికి రిలీఫ్ దొరికింది. అమెరికాలోని మొత్తం రెండున్నర లక్షల హెచ్ 1 బీ వీసా హోల్డర్డ్స్ లో 2 లక్షల మంది జూన్ చివరి నాటికి లీగల్ స్టేటస్ కోల్పోనుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇమ్మిగ్రేషన్ ను ఆరు నెలల పాటు అమెరికా నిలిపివేయటంతో స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అంతా భయపడ్డారు. కానీ అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయంతో వీరికి మరో రెండు నెలల సమయం దొరికింది. సాధారణంగా హెచ్ 1 బీ వీసా పై వెళ్లిన వారు లీగల్ స్టేటస్ పూర్తయ్యే లోపు వీసా రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ హెచ్ 1 బీ వీసా తో వెళ్లి జాబ్ కోల్పోతే రెండు నెలల్లోగా ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరాలి. లేదంటే వారు స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. అమెరికాలో హెచ్ 1 బీ వీసా తో వెళ్లిన వారు గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేసిన వారిలో ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. కరోనా క్రైసెస్ జాబ్ కోల్పోయిన హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ లో కు కొత్త జాబ్ వెతుక్కోవటానికి మరో రెండు నెలల అదనంగా సమయం దొరికింది. హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లను మరో 60 రోజుల్లోగా ఎప్పుడైనా సమర్పించవచ్చని ప్రభుత్వం సూచించింది.