- యూఎస్ వాసికి అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట చిన్న కణితి
- అమెరికన్ఆంకాలజీకి వచ్చిన పేషెంట్
- 1.5 సె.మీ కణతిని తొలగింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఆ పేషెంట్ఉండేది అమెరికాలో.. అక్కడ లేని ఆధునిక చికిత్సలు లేవు.. అయినా అతడు తన వ్యాధి నయం చేసుకోవడానికి ఇండియాకు వచ్చాడు. అది కూడా మెడికల్‌హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌కు....వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. యూఎస్‌కు చెందిన 54 ఏండ్ల రోగికి అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట1.5 సెంటీమీటర్ల కణితి ఏర్పడింది. ఇది చాలా చిన్నది కావడం, కంటికి సరిగ్గా కనిపించని చోట ఉండటంతో సాధారణ సర్జరీ ద్వారా తొలగించడం సవాలుగా మారింది.
దీంతో హైదరాబాద్‌లోని అమెరికన్ఆంకాలజీ ఇన్స్టిట్యూట్సీనియర్ రోబోటిక్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గజగౌని ను సంప్రదించాడు. ఆయన నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ట్రిపుల్ఐసీజీ ఫ్లోరోసెన్స్ విధానంలో రోబోటిక్సర్జరీ చేసి కణతిని విజయవంతంగా తొలగించింది.
సర్జన్లు తమ అనుభవంపై ఆధారపడి కణితిని గుర్తిస్తారని, కానీ, ట్రిపుల్ ఐసీజీ పద్ధతిలో ఇండోసైనిన్ గ్రీన్ అనే కలర్ఉపయోగించి క్యాన్సర్కణితిని గుర్తించి పూర్తిగా తొలగించొచ్చవచ్చని డాక్టర్జగదీశ్వర్గౌడ్చెప్పారు. దీన్ని ఇండియాలో తాము మాత్రమే వాడుతున్నామని, ఈ విధానంలో ఇప్పటివరకు 32 మందికి సర్జరీ చేయగా, వంద శాతం సక్సెస్‌రేటు సాధించామన్నారు. ఈ అధ్యయనానికి అమెరికాలోని మయామిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందన్నారు. కార్యక్రమంలో ఏవోఐ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పలచర్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
