టిక్‌టాక్‌ బ్యాన్‌తో.. హైదరాబాద్ యాప్ కు జోష్

టిక్‌టాక్‌ బ్యాన్‌తో.. హైదరాబాద్ యాప్ కు జోష్

1 మిలియ‌న్‌కు పైగా డ‌బ్‌షూట్ డౌన్‌లోడ్లు
ప్రతిరోజూ 15 వేలకు పైగా కొత్త వీడియోలు

హైదరాబాద్‌, వెలుగు: టిక్‌టాక్ యాప్‌ను కేంద్రం నిషేధించ‌డంతో డ‌బ్‌షూట్ యాప్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైద‌రాబాద్‌కు చెందిన ఎంట‌చ్ ల్యాబ్స్ రూపొందించిన ఈ వీడియో షేరింగ్ యాప్‌కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ క‌నిపిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో దీని డౌన్‌లోడ్ల సంఖ్య 1 మిలియన్‌కు పైగా పెరిగింది. టిక్‌టాక్‌ ఆల్టర్నేటివ్ కోసం చూస్తోన్న యూజర్లకు డ‌బ్‌షూట్ బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ ప్లాట్‌ఫాంలో ప్రతిరోజూ 15 వేల‌కు పైగా కొత్త వీడియోలు షేర్ అవుతున్నాయి.“ ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడి ఇచ్చిన ‘మేడిన్ ఇండియా’ పిలుపునకు ఇండియన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో త‌యారైన వ‌స్తువులు, ప్లాట్‌ఫాంల‌నే ప్రజలు విరివిగా ఉప‌యోగిస్తున్నారు. మొబైల్ అప్లికేష‌న్లతో స‌హా అన్నింటిలోనూ అది ఇప్పుడు మ‌న‌కు క‌నిపిస్తోంది. జూన్‌కు ముందు దాదాపు అర మిలియ‌న్ యూజ‌ర్లు ఉన్న డ‌బ్‌షూట్‌, గ‌త వారం రోజులుగా యూజ‌ర్ల సంఖ్యను గ‌ణ‌నీయంగా పెంచుకుంది”అని డ‌బ్‌షూట్ సీఈవో, కో ఫౌండర్‌ పి. వెంక‌టేశ్వర‌రావు చెప్పారు. హిందీ,ఇంగ్లీష్ తో పాటు అన్ని ప్రాంతీయ భాష‌ల్లో కూడా ఈ యాప్ ఉంది. ఇందులో యూజ‌ర్ల భ‌ద్రత‌కు, ప్రైవ‌సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, వాళ్ల అనుమ‌తి లేకుండా ఎలాంటి కంటెంట్‌ను డ‌బ్‌షూట్ అప్‌లోడ్ చేయ‌దని వెంక‌టేశ్వర‌రావు వివ‌రించారు.

For More News..

యాప్స్ చేసే సత్తా ఉంది కానీ పైసలే లేవు

వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం

దుకాణాలు, సూపర్ జజార్లలో ఎక్స్ పైరీ ఫుడ్ ఐటమ్స్

కరోనా డేంజర్లో హైదరాబాద్