భగత్​సింగ్​ సెట్స్​లో ‘పెళ్ళి సంద‌‌D’ బ్యూటీ

భగత్​సింగ్​ సెట్స్​లో ‘పెళ్ళి సంద‌‌D’ బ్యూటీ

‘పెళ్ళి సంద‌‌D’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఫస్ట్ మూవీతోనే యూత్‌‌లో విప‌‌రీతమైన క్రేజ్ వ‌‌చ్చింది. అలాగే వరుస ఆఫర్స్ కూడా  క్యూ కడుతున్నాయి. యంగ్ హీరోస్ దగ్గర్నుంచీ సీనియర్ హీరోల సినిమాలకు వరకు శ్రీలీలనే ఫస్ట్ చాయిస్ అవుతుంది. ఇటీవల రవితేజ  ‘ధమాకా’తో సక్సెస్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం బాలకృష్ణ చిత్రంలో నటిస్తోంది.  తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో పార్ట్ అయ్యింది శ్రీలీల. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌‌సింగ్’ చిత్రంలో శ్రీలీలను హీరోయిన్‌‌గా ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేశారు.

‘వెల్కమ్ ఆన్ బోర్డ్’ అంటూ ‘ఉస్తాద్ భగత్‌‌సింగ్’ సెట్‌లోకి స్వాగతం పలికారు దర్శక నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, మహేష్​ బాబు చిత్రాల్లో 
నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల.