ప్రచారాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ?

ప్రచారాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ?
  • సొంత నియోజక వర్గానికే పరిమితమైన ఉత్తమ్‌
  • ఇతర సెగ్మెంట్ల ప్రచారానికి వెళ్లని పీసీసీ చీఫ్
  • రాష్ట్ర రథ సారథి తీరుతో కేడర్ లో అయోమయం

రాష్ట్రమంతా కలియ తిరుగుతూ లోక్ సభ ఎన్నికల్లోపార్టీని విజయ పథం వైపు నడిపించాల్సిన పీసీసీ చీఫ్‌ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం తన నియోజక వర్గానికే పరిమితం కావడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిం ది. ఆయన ప్రచారానికి రాకపోవడాన్నికొం దరు అభ్యర్థులు తప్పు పడుతున్నా రు. నల్గొండ లోక్ సభ పరిధిలో కూడా ఉత్తమ్‌ రెండు, మూడు నియోజక వర్గాల్లోనే ఎక్కువ ప్రచారం నిర్వహిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఉత్తమ్‌ సన్నిహిత నేతలు మాత్రం కాం గ్రెస్‌ గెలిచే అవకాశమున్న స్థానాల్లో నల్గొండ ఒకటనీ, అందుకే దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు. నల్గొండ గెలుపుతో అటు ఉత్తమ్‌ ప్రతిష్టతోపాటు పార్టీకి కూడా నైతిక స్థైర్యం వస్తుందని సమర్థిస్తున్నా రు.

గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ..

వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్తమ్‌ తొలుత ఆసక్తి చూపలేదు. నల్గొండ లోక్ సభ సీటును టికెట్ ను ఎవరికైనా కేటాయించాలని చెప్పా రు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అధిష్టానానికి వివరించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు.నల్గొండ నుంచి పోటీ చేయాల్సిందేనని హైకమాండ్‌ చెప్పింది. దాంతో రంగంలోకి దిగిన ఆయన ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలవాలన్న పట్టుదలతో పూర్తిగా నియోజక వర్గానికి పరిమితమై ప్రచార కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు నేతలు పార్టీ మారుతూ తాము ఉత్తమ్‌ వ్యవహార శైలి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. కొందరు అవినీతి ఆరోపణలు చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఉత్తమ్ ను పీసీసీ పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా సాగుతోం ది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని ఉత్తమ్‌ సమర్థంగా వినియోగించు కోవాలని భావిస్తున్నారనీ, హుజూర్ నగర్‌ అసెంబ్లీ సీటు గెలిచిన తీరులోనే లోక్ సభ సీటును కూడా గెలిచి అందరి నోళ్లు మూయించాలనే పట్టుదలతో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నా రు. అందుకే నియోజక వర్గం దాటి ఎక్కడకు వెళ్లకుండా స్థానికంగా తిష్టవేసి ప్రచార కార్యక్రమాలు చూసుకుంటున్నారని అంటున్నారు.

పార్టీలో మారిన సీన్‌

అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రపు సీట్లు గెలవడం,కొందరు ఎమ్మెల్యే లు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో నిరాశ ఆవరించింది. స్థానిక నేతల్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదు. రాష్ట్ర నేతలు ప్రచారానికి వస్తే ఒక ఊపు వస్తుందనీ, కొన్నిసీట్లనైనా గెలుచుకోవచ్చునని పార్టీ నేతలు అంటున్నారు.  ప్రచార కమిటీలు వేసి అధిష్టానం చేతులుదులుపుకుందనీ, టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ రాష్ట్రంలో ప్రచారాన్ని సమన్వయ పర్చాల్సిన బాధ్యత మర్చిపోయారని విమర్శిస్తున్నా రు. పార్టీ అధ్యక్షుడి హోదాలో సభలు, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నపుడే  క్షేత్రస్థాయిలో ఊపు వస్తుందనీ, కానీ ఆయన కేవలం తాను పోటీ చేస్తున్న నియోజక వర్గానికే పరిమితం కావడాన్ని కొందరు నాయకులు, అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నా రు. చివరకు ఇటీవల రాహుల్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఉత్తమ్ కుమార్‌ తన నియోజక వర్గ పరిధిలో జరిగిన హుజూర్ నగర్‌ సభకు మాత్రమే హాజరయ్యారు. ఇతర రెండు సభలకు వెళ్లలేదు. గాంధీభవన్ లోజరిగిన సీఎల్పీ భేటీకి కూడా గైర్హాజరయ్యారు.బుధవారం గాంధీభవన్ లో ముఖ్య నేతల ప్రెస్‌ మీట్‌ ఉంటుందని ముందు రోజు ఆహ్వానాలు పంపారు.అందులో ఉత్తమ్‌ ఉంటారనుకుంటే ఆయన నియోజక వర్గ ప్రచారానికే పరిమితమయ్యారు.