సాగర్ ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం

సాగర్ ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం

ఉమ్మడి రాష్ట్రంలో కంటే నీళ్ల వాటాలో.. తెలంగాణకు ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం నీటిని దోచుకుపోతున్నా.. తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు అధికారికంగానే మొదలయ్యాయన్నారు ఉత్తమ్. అయినా కేసీఆర్ ప్రభుత్వం చూస్తూ సైలెంటుగా ఉందన్నారు. తెలంగాణకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు కూడా ఏపీ తీసుకెళ్తోందన్నారు. సాగర్ కింద ఉన్న లక్షల ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల్లో వృథా ఖర్చు ఎక్కువవుతోందన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందన్నారు.