ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం

స్మార్ట్ సిటీ మిషన్ కింద డూన్ కనెక్ట్ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‭లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు.  దీంతో డెహ్రాడూన్‌లో మరో 10 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని.. పర్యావరణ హితంగా కూడా ఉంటుందని అన్నారు.

అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి ఘంటాఘర్ వరకు బస్సులో పుష్కర్ సింగ్ ధామి ప్రయాణించారు. టికెట్ తీసుకుని సాధారణ ప్రయాణికుడిలా ఆయన బస్సులో కూర్చుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం గురించి ఈసందర్భంగా ప్రయాణికులకు వివరించారు. ఇప్పటికే డెహ్రాడూన్ లో 20 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఇప్పుడు అదనంగా మరో 10 బస్సులు అందుబాటులోకి వచ్చాయి.