IND vs ENG: టీమిండియా అండర్-19 కెప్టెన్‌గా CSK చిచ్చర పిడుగు.. ఇంగ్లాండ్ సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ

IND vs ENG: టీమిండియా అండర్-19 కెప్టెన్‌గా CSK చిచ్చర పిడుగు.. ఇంగ్లాండ్ సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ

ఓ వైపు భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో జిజీగా మారుతుంటే.. మరోవైపు టీమిండియా యంగ్ క్రికెటర్లు అండర్-19 లో ఇంగ్లాండ్ తో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 27 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు  గురువారం (మే 22) భారత అండర్-19 జట్టును ప్రకటించారు. ముంబై స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. ఐపీఎల్ లో మాత్రే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ళ ఈ ముంబై కుర్రాడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతంగా ఆడి భవిష్యత్ స్టార్ గా కితాబులందుకున్నాడు. 

ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆరు ఇన్నింగ్స్‌లలో మాత్రే 206 పరుగులు చేశాడు. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 48 బంతుల్లో 94 పరుగులు చేసి సంచలనంగా మారాడు. మాత్రేతో పాటు 
బీహార్ కుర్రాడు.. ఇటీవలే ఐపీఎల్ లో 35 బంతుల్లో సెంచరీతో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ తో జరగబోయే అండర్-19 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ ల్లో 200 పైగా స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుకు ఆశాకిరణంలా మారాడు. 

స్క్వాడ్ విషయానికి వస్తే పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల బ్యాటర్ విహాన్ మల్హోత్రా, ఇటీవలి కూచ్ బెహార్ ట్రోఫీలో సెంచరీ సాధించిన గుజరాత్ బ్యాటర్ మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. 17 ఏళ్ల ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు ఈ పర్యటనకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 18 ఏళ్ళ సౌరాష్ట్ర ప్లేయర్ హర్వంశ్ సింగ్ రెండో వికెట్ కీపర్‌ గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ జూన్ 27న హోవ్‌లో.. రెండు, మూడు వన్డేలు వరుసగా జూన్ 30, జూలై 2 తేదీలలో నార్తాంప్టన్‌లో జరుగుతాయి. చివరి రెండు టీ20లు జూలై 5, జూలై 7న వోర్సెస్టర్‌లో జరగనున్నాయి. 

భారత U19 జట్టు :

ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ రావ్ పటేల్, ఖిలాన్ రావ్ పటేల్, హేన్త్ పటేల్, హేన్త్ మహమ్మద్ ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ప్లేయర్స్ : నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్ కీపర్)