లీలమ్మో పర్ఫెక్ట్ మాస్ సాంగ్

లీలమ్మో పర్ఫెక్ట్ మాస్ సాంగ్

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’.  సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చూన్‌‌ ఫోర్‌‌ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ‘లీలమ్మో.. లీలమ్మో’  అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేశారు.  

జీవీ ప్రకాష్ కంపోజ్ చేసిన పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌మీట్‌‌లో  వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ  ‘ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.  శ్రీలీల మాట్లాడుతూ ‘ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుంది. 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట.

పైగా నా పేరుతో పాట కావడంతో  నాకు మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పింది.  ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుంది’ అని దర్శకుడు శ్రీకాంత్ చెప్పాడు. రచ్చ రవి, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.