తెలంగాణపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా? పవన్ కల్యాణ్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్

తెలంగాణపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా? పవన్ కల్యాణ్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
  • తెలంగాణపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా?
  • తెలంగాణ హక్కులను కాలరాసినప్పుడు ఎక్కడికి పోయావ్‌‌‌‌?
  • ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్రాన్ని పాకిస్తాన్‌‌‌‌తో పోల్చినప్పుడు ఏమయ్యావ్‌‌‌‌?
  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫైర్

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌కు ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ కోసం విద్యార్థులు, ప్రజలు ప్రాణ త్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు.

తెలంగాణను అవమానించిన, ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన శక్తులతో పొత్తులు పెట్టుకున్న ఆయన.. ఇప్పడు ప్రేమ కురిపించడం రాజకీయ నాటకమన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌‌‌‌తో పోల్చినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ కోసం పోరాడింది.. తెలంగాణను ఇచ్చింది.. తెలంగాణ హక్కులను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరు ఉపయోగించే వారిని ప్రజలు ఎన్నడూ నమ్మరన్నారు. 


తెలంగాణ రైతాంగంపై కేంద్రం వివక్ష..


తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని వంశీకృష్ణ ఆరోపించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని విమర్శించారు. ఎఫ్‌‌‌‌సీఐ కోటా తగ్గించి రైతులకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. యూరియా సరఫరాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే తెలంగాణకు యూరియా కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పనితీరు సరిగాలేదని ఆరోపించారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదని, కేవలం 70 శాతం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని, దీనిపై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో రూ.లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల ప్రాజెక్టుగా మారిందన్నారు. గత పదేండ్లు యువత భవిష్యత్తుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ఆటలాడుడుకున్నదని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.