మేషం (మార్చి21 – ఏప్రిల్20)
కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన బాకీలు అందుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ ప్రతిపాదనలు అందరి ఆమోదం పొందుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి మార్పులు తథ్యం.
వృషభం (ఏప్రిల్21 – మే21)
నిరుద్యోగులు చేసే కృషి ఫలిస్తుంది. శత్రువులు స్నేహితులుగా మారి, మీ అభివృద్ధికి సహకరిస్తారు. ముఖ్యమైనవిషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు . పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు లభించవచ్చు. విధి నిర్వహణలో ప్రోత్సాహకరం.
మిథునం (మే22 – జూన్22)
కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆత్మీయుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొంత నిదానం పాటించడం మంచిది. ఉద్యోగులకు పనిభారం మరింత తప్పదు. వారారంభంలో శుభవార్తలు. వాహనయోగం.
కర్కాటకం (జూన్23 – జూలై23)
ముఖ్య కార్యక్రమాలలో జాప్యం. రుణాలు చేస్తారు. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. దూరప్రయాణాలు. సన్నిహితుల నుంచి ఆరోపణలు. వ్యాపారులకు కొంత నిరాశ తప్పదు.ఉద్యోగులకు పనిఒత్తిడులు, కొన్ని మార్పులు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. వారం మధ్యలో తండ్రి తరఫు నుంచి ధనలాభం. అరుదైన ఆహ్వానాలు.
సింహం (జూలై24 – ఆగస్టు22)
రావలసిన డబ్బు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. అందరి మెప్పు పొందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. ఆస్తుల విక్రయాల ద్వారా లబ్ధి. వ్యాపార విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు దక్కవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరం.
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22)
అదనపు ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. అనుకోని సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ సేవలకు తగిన గుర్తింపు రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వ సహాయం అందే అవకాశం.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22)
ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22)
అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా శుభవార్తలు. కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన లేఖ సంతోషం కలిగిస్తుంది. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22)
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పాతబాకీలు వసూలై ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబసభ్యులను సంప్రదిస్తారు. గృహ నిర్మాణ యత్నాలలో అనుకూలత. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలించే సమయం.
మకరం (డిసెంబర్23 – జనవరి22)
ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు సవ్యంగా పూర్తి కాగల సమయం. ఇంటాబయటా మీదే పైచేయి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు.
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
రాబడి పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో సఖ్యత.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు తథ్యం. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం.
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. భూ, గృహయోగాలు.వ్యాపారులు అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా గడుస్తుంది.
-వక్కంతం చంద్రమౌళి, జ్యోతిష్య పండితులు, ఫోన్: 98852 99400
