KCR బయోపిక్ : తెలివిగా ఆలోచించాలంటున్న వర్మ

KCR బయోపిక్ : తెలివిగా ఆలోచించాలంటున్న వర్మ

‘టైగర్ కేసీఆర్- అగ్రెసివ్ గాంధీ’ పేరుతో కేసీఆర్ బయోపిక్ ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తాను డిఫరెంట్ అనిపించారు. శనివారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తానని చెప్పిన వర్మ.. ఓ వీడియోను మాత్రం పోస్ట్ చేశారు. ఫస్ట్ లుక్ అంటే ఇలా ఉండాలి… అని ఇప్పటికే సినీ అభిమానుల్లో ఓ రకమైన ఫార్మాట్ క్రియేట్ అయి ఉంది. ఐతే.. దానిని బ్రేక్ చేస్తూ… కొత్తగా ట్రై చేశారు ఆర్జీవీ.

కేసీఆర్ బయోపిక్ లో క్యారెక్టర్లను ఫస్ట్ లుక్ లో రివీల్ చేస్తారేమో.. కేసీఆర్ పాత్ర వేసేదెవరో చెబుతారేమో.. కేసీఆర్ గెటప్ ఎలా ఉంటుందో చూద్దాం అన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీలో బాగా క్రియేట్ అయింది. ఐతే.. వర్మ ఎటువంటి పోస్టర్ గానీ… మూవీకి సంబంధించిన వీడియో గానీ పోస్ట్ చేయలేదు. దీంతో.. చాలామంది వర్మను క్రిటిసైజ్ చేశారు. ఊరించి ఉస్సూరుమనిపించారు.. మాటిచ్చి తప్పారు… 11గంటలకు ఫస్ట్ లుక్ ఇవ్వలేదు.. అని విమర్శించారు. దీనికి ఎప్పటిలాగే తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.

“టైగర్ కేసీఆర్ ఫస్ట్ లుక్ ఏదీ అని అడుగుతున్నవారికి ఇదే నా రిప్లై. కింద పోస్ట్ చేసిన వీడియోనే ఆ ఫస్ట్ లుక్. సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం చెప్పడమే ఫస్ట్ లుక్ ఉద్దేశమైతే… నేను పోస్ట్ చేసిన వీడియోలో అంతకంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ ఉందిగా. పోస్టర్ లేదా టీజర్ కంటే ఆ నా వీడియోనే చాలా చెబుతుంది. గైస్.. ఎదగండి.. తెలివిగా ఆలోచించండి” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

వర్మ వివరణ విన్నాక.. కామెంట్లతో రెచ్చిపోయారు నెటిజన్స్. గ్రేట్ ఐడియా అని కొందరు.. మాకు తెల్సులే అని మరికొందరు అన్నారు. ఆర్జీవీ మరోసారి కవర్ డ్రైవ్ చాలా చక్కగా ఆడారని సెటైర్స్ వేశారు.