కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా ‘వేదవ్యాస్’ రూపొందిస్తున్నారు. కె అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు. పిడుగు విశ్వనాథ్ హీరోగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌తోపాటు ‘వేదవ్యాస్’ మేకింగ్ వీడియోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నటులు మురళీమోహన్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, అలీ, శివాజీ రాజా, లయ, దర్శక నిర్మాతలు రేలంగి నరసింహారావు, చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు హాజరై ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మరిన్ని బర్త్‌డేలు జరుపుకోవాలని, ఆయన రూపొందిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రం సక్సెస్ సాధించాలని కోరారు. మన వేదాలు, సంస్కృతి గొప్పదనం చెబుతూ ‘వేదవ్యాస్’ చిత్రం తెరకెక్కుతోందని మేకర్స్ తెలియజేశారు.
