టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న వీణావాణీ   

టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న వీణావాణీ   

అవిభక్త కవలలు వీణా-వాణీలు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వీరు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని స్టేట్‍ హోమ్‍లో ఉంటున్నారు. వెంగళరావునగర్‌ గవర్నమెంట్‍ హై స్కూల్‍లో అడ్మిషన్‍ ఇచ్చారు. స్కూల్‍కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో టీచర్లే రోజూ వంతుల వారీగా హోమ్‍కి వచ్చి చదువు చెప్పారు. చాలా చక్కగా చదువుతున్నారని, ప్రీ ఫైనల్‍ ఎగ్జామ్స్​లో 80 శాతం మార్కులు తెచ్చుకున్నారని టీచర్లు చెప్పారు.  అయితే ఇప్పటి వరకూ ఎస్​ఎస్​సీ బోర్డు చరిత్రలో, నేరుగా టెన్త్ ఇంగ్లిష్​ మీడియం ఎగ్జామ్స్ రాస్తున్నది వీణావాణీలే కావడం గమనార్హం.

వేర్వేరుగా హాల్‍ టికెట్స్

వీణావాణీలు ఎగ్జామ్స్ రాసే విషయంలో పలు సమస్యలు తలెత్తాయి. అసలు ఎగ్జామ్స్ రాసే సామర్థ్యం ఉందా లేదా అని డాక్టర్లతో పరీక్షలు చేయించారు. వారు ఓకే చెప్పడంతో ఇద్దరికీ ఒకే హాల్‍టికెట్‍ ఇవ్వాలా లేక వేర్వేరుగా ఇయ్యాలా అన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. చివరికి వేర్వేరుగా హాల్‌ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వెంగళ్​రావునగర్ గవర్నమెంట్ హైస్కూల్  హెడ్మాస్టర్ ధనుంజయ్ మంగళవారం స్టేట్​హోంకు వెళ్లి వారికి హాల్​టికెట్లు ఇచ్చారు. తాము స్వయంగా ఎగ్జామ్స్ రాయగలమని వీణా–వాణి చెబుతున్నా… ఎందుకైనా మంచిదని వారికి స్ర్కైబ్‌లుగా వెంగళరావునగర్‌ స్కూల్లో 9వ క్లాస్‍ చదివే ఇద్దరు స్టూడెంట్స్ ని అరేంజ్​ చేశారు. బుధవారం ఐసీడీఎస్​అధికారులు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్​ సత్యనారాయణరెడ్డిని కలిసి, వారికి స్క్రైబ్స్​ను కేటాయించాలని కోరారు. ఆయన వెంటనే హైదరాబాద్​ డీఈఓ వెంకటనర్సమ్మను స్క్రైబ్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదనంగా అరగంట

స్టేట్‍ హోమ్‍కు అర​ కిలోమీటర్‍ దూరంలో ఉన్న మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో సెంటర్‍ కేటాయించారు. అలాగే వీరికి అదనంగా అరగంట టైం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆన్సర్‍ షీట్లను స్పెషల్​గా ప్యాక్‍ చేసి బోర్డుకు పంపనున్నట్లు చెప్పారు. సెంటర్‍కి వచ్చి వెళ్లేందుకు మహిళా శిశు సంక్షే మ శాఖ స్పెషల్​వెహికల్​ ఏర్పాటు చేసింది.