పొన్నియిన్ సెల్వన్-2 నుంచి వీర రాజ వీర సాంగ్ విడుదల

పొన్నియిన్ సెల్వన్-2 నుంచి వీర రాజ వీర సాంగ్ విడుదల

జయం రవి, విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధానపాత్రల్లో మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్‌‌ సెల్వన్‌‌’. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్‌‌ పార్ట్‌‌ కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో విడుదలైంది. సెకెండ్ పార్ట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఇప్పటికే సాంగ్స్‌‌, టీజర్, ట్రైలర్‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు.  తాజాగా ‘వీర రాజ వీర.. శూర ధీర శూర’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. 

సినిమాలో అరుణ్మనిగా నటించిన జయం రవి వీరత్వాన్ని కీర్తిస్తూ సాగుతుంది పాట. రాజ్యంలోకి వచ్చిన అరుణ్మనికి స్వాగతం పలుకుతూ అతని ప్రేయసి శోభిత ధూళిపాళ నాట్యం చేస్తూ ఆయన కీర్తిని వర్ణిస్తూ పాడిన పాట ఆకట్టుకుంటుంది. ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేయగా, ఆస్కార్  విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. శంకర్ మహదేవన్, చిన్మయి శ్రీపాద కలిసి పాడారు.  చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ‌‌ద్రాస్ టాకీస్‌‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి.