Good Health : శాఖాహార కబాబ్స్.. ఎక్కువ ప్రొటీన్స్తో మంచి ఆరోగ్యం

Good Health : శాఖాహార కబాబ్స్.. ఎక్కువ ప్రొటీన్స్తో మంచి ఆరోగ్యం

ప్రతి ఒకరి డైట్ లో న్యూట్రియెంట్స్, ప్రొటీన్స్, ఫైబర్ సమానంగా ఉండాలి. పిల్లల విషయానికి వస్తే వాళ్లకు ప్రొటీన్ చాలా అవసరం. ఆకుకూరలు తినమన్నా, పాలు తాగమన్నా... వద్దంటే వద్దని అంటారు. అలాంటప్పుడు వాళ్లు ఇష్టపడేలా వండిపెట్టాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజ.  

ప్రొటీన్ తొందరగా అరగదని, అది బాడీ బిల్డర్స్ కి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు. చాలామంది తల్లులు. కానీ, ప్రొటీన్ అందరికీ అవసరమే. ఈ హైప్రొటీన్ కబాబ్స్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు అన్నారామె.

కబాబ్స్ కోసం.. కావాల్సినవి..

  • శనగలు (నానబెట్టినవి),
  • అల్లం వెల్లుల్లి,
  • పచ్చిమిర్చి,
  • మసాలాలు(చాట్ మసాలా, మిరియాలపొడి, ఇంగువ, ఉప్పు, ధనియాలపొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్), 
  • కొత్తిమీర,
  • నిమ్మరసం,
  • ఉల్లిగడ్డ,
  • నువ్వులు,
  • నూనె.

తయారీ విధానం...

ఒక గిన్నెలో నానబెట్టిన శనగలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, పచ్చిమిర్చి తరుగువేసి మెత్తటి పేస్ట్ లాకలపాలి. కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వులు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేసి కబాబ్ లా వత్తాలి. నూనె వేడిచేసి కబాబ్స్ ను ఎర్రగా ఫ్రై చేయాలి.