మొన్నటివరకూ టెక్నాలజీ అంటే శ్రమను తగ్గించేదిగా ఉండేది. ఇప్పుడా టెక్నాలజీ ఆలోచించడం మొదలుపెట్టింది. దాంతో అది మనిషికే పోటీ ఇస్తోంది. టెక్ ప్రపంచంలో ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రోజువారీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ శతాబ్దపు టెక్నాలజీగా పాపులర్ అవుతున్న ఏఐ.. చూస్తుండగానే రకరకాల రూపాలు మార్చుకుంటోంది. ఒకపక్క రోజుకో ఏఐ టూల్ ఎంట్రీ ఇవ్వడం, మరోపక్క కంపెనీల్లో లేఆఫ్స్ పెరగడం చూస్తుంటే రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్‌లో ఎన్నో మార్పులు రాబోతున్నట్టు అర్థమవుతోంది.
చాలారకాల జాబ్స్‌కు ఏఐ ఆల్టర్నేటివ్‌గా మారుతోంది. సొంతంగా ఆలోచించి చిటికెలో ఎంత పెద్ద టాస్క్‌నైనా పూర్తి చేయగల ఏఐ.. అసలు ఎలా పనిచేస్తుంది? జాబ్ మార్కెట్‌పై ఏఐ ఎఫెక్ట్ ఎంతలా ఉండబోతోంది? రానున్న రోజుల్లో ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది? అనే విషయాలు ఈ వారం కవర్ స్టోరీలో..
మొన్నటివరకూ టెక్నాలజీ అంటే శ్రమను తగ్గించేదిగా ఉండేది. ఇప్పుడా టెక్నాలజీ ఆలోచించడం మొదలుపెట్టింది. దాంతో అది మనిషికే పోటీ ఇస్తోంది. టెక్ ప్రపంచంలో ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రోజువారీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ శతాబ్దపు టెక్నాలజీగా పాపులర్ అవుతున్న ఏఐ.. చూస్తుండగానే రకరకాల రూపాలు మార్చుకుంటోంది. ఒకపక్క రోజుకో ఏఐ టూల్ ఎంట్రీ ఇవ్వడం, మరోపక్క కంపెనీల్లో లేఆఫ్స్ పెరగడం చూస్తుంటే రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్‌లో ఎన్నో మార్పులు రాబోతున్నట్టు అర్థమవుతోంది. చాలారకాల జాబ్స్‌కు ఏఐ ఆల్టర్నేటివ్‌గా మారుతోంది. సొంతంగా ఆలోచించి చిటికెలో ఎంత పెద్ద టాస్క్‌నైనా పూర్తి చేయగల ఏఐ.. అసలు ఎలా పనిచేస్తుంది? జాబ్ మార్కెట్‌పై ఏఐ ఎఫెక్ట్ ఎంతలా ఉండబోతోంది? రానున్న రోజుల్లో ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది? అనే విషయాలు ఈ వారం కవర్ స్టోరీలో..
కొన్ని ఫ్యాక్ట్స్
హోంవర్క్‌ని చాట్‌బోట్‌లతో చేయించడం, రీసెర్చ్ పేపర్స్‌ను కూడా చాట్ బోట్‌లతో రాయించడం లాంటివి చేస్తుండడంతో చాలా స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్స్ చాట్ జీపిటీ వాడకాన్ని బ్యాన్ చేశాయి.
చాట్ జీపీటీ రిలీజైన తర్వాత ఓపెన్ ఏఐ సంస్థ విలువ ఏకంగా 2,900 కోట్ల డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్ ఏఐ కంపెనీలో సుమారు వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది.
చాట్ జీపీటీ వచ్చిన తర్వాత గూగుల్ కూడా ల్యామ్డా, బార్డ్ పేర్లతో రెండు ఏఐ టూల్స్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
లెర్నింగ్, ఎడ్యుకేషన్, డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగాలతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలనూ ఈ టూల్ ప్రభావితం చేసే అవకాశముందని న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్‌లో ప్రచురించింది.
చాట్ జీపీటీ తరహాలోనే మనదేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ‘వెలాసిటీ’ సంస్థ లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌కు ‘లెక్సీ’ అని పేరు పెట్టింది. ఈ టూల్.. ఇ–కామర్స్ బిజినెస్‌ల్లో రోజువారీ రిపోర్ట్స్, ఇన్‌సైట్స్ పంపిస్తుందని కంపెనీ తెలిపింది.
ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు
చాట్‌జీపీటీ వల్ల ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయని ఆ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసిన ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. “సొసైటీ రూపురేఖలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మారుస్తుంది. ఏఐ వల్ల కొన్ని సమస్యలు లేకపోలేదు. కానీ, మనుషులు ఇంతవరకు ఇలాంటి గొప్ప టెక్నాలజీని డెవలప్ చేయలేదు. చాట్‌జీపీటీతో ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయి.
మనం వీటికంటే మెరుగైన జాబ్స్ క్రియేట్ చేస్తాం. మన జీవితాలను మరింత మెరుగ్గా మార్చడానికే ఏఐని డెవలప్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అన్నది మారుతూ ఉండాలి. గతంలో కాలిక్యులేటర్ రావడంతో మ్యాథ్స్ చెప్పడం, స్టూడెంట్స్‌ను టెస్ట్ చేయడం పూర్తిగా మారింది. ఇది కూడా అలాంటిదే. చాట్‌జీపీటీని పనిలో సాయంగా వాడుకోవాలి” అన్నారాయన.
ఏఐ అనేది కో-వర్కర్‌గా మాత్రమే ఉంటుందంటున్నారు టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ఓ మిలింద్ లక్కడ్. “కస్టమర్‌ను అర్థం చేసుకునేందుకు అది కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఉద్యోగాల స్థానాన్ని అది భర్తీ చేస్తుందని కాదు. కానీ, ఉద్యోగాల డెఫినిషన్ మాత్రం మారుతుంది. ఫ్యూచర్ కోసం చాట్‌జీపీటీ మంచిదే. ఉద్యోగులకూ ఇది సాయంగా ఉంటుంది. ఇలాంటి టూల్స్ వచ్చినప్పటికీ.. బిజినెస్ మోడల్‌ను మాత్రం మార్చలేవు.
ప్రొడక్టివిటీ పెంచడం, వర్క్‌లో స్టెబిలిటీ, మేనేజ్‌మెంట్ అవసరాన్ని తగ్గించడం, సర్వీసులు వేగంగా డెలివరీ చేయడం వంటి వాటికి ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయి. టీసీఎస్ ఇప్పటికే కొన్ని టూల్స్ వాడుతోంది. వచ్చే రెండేండ్లలో వీటి పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది” అనేది మిలింద్ అభిప్రాయం.
కొన్ని ఫ్యాక్ట్స్
హోంవర్క్‌ని చాట్‌బోట్‌లతో చేయించడం, రీసెర్చ్ పేపర్స్‌ను కూడా చాట్ బోట్‌లతో రాయించడం లాంటివి చేస్తుండడంతో చాలా స్కూల్స్, కాలేజీలు స్టూడెంట్స్ చాట్ జీపిటీ వాడకాన్ని బ్యాన్ చేశాయి.
చాట్ జీపీటీ రిలీజైన తర్వాత ఓపెన్ ఏఐ సంస్థ విలువ ఏకంగా 2,900 కోట్ల డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్ ఏఐ కంపెనీలో సుమారు వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది.
చాట్ జీపీటీ వచ్చిన తర్వాత గూగుల్ కూడా ల్యామ్డా, బార్డ్ పేర్లతో రెండు ఏఐ టూల్స్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
లెర్నింగ్, ఎడ్యుకేషన్, డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగాలతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలనూ ఈ టూల్ ప్రభావితం చేసే అవకాశముందని న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్‌లో ప్రచురించింది.చాట్ జీపీటీ తరహాలోనే మనదేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ‘వెలాసిటీ’ సంస్థ లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌కు ‘లెక్సీ’ అని పేరు పెట్టింది. ఈ టూల్.. ఇ–కామర్స్ బిజినెస్‌ల్లో రోజువారీ రిపోర్ట్స్, ఇన్‌సైట్స్ పంపిస్తుందని కంపెనీ తెలిపింది.
ఏఐ చట్టాలు
ఏఐతో.. పర్సనల్ ప్రైవసీ, దేశ భద్రతలకు సంబంధించిన సమస్యలతోపాటు చట్టపరమైన, నైతికపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని పరిష్కరించాలంటే ఏఐ సిస్టమ్స్‌ను నడిపే అల్గారిథమ్స్‌ను పక్కాగా రూపొందించాలి. ఏఐని మంచి ప్రయోజనాల కోసం వాడడం కోసం ప్రభుత్వాలు చట్టాలు తేవాల్సి ఉంటుంది. ఏఐ వాడకంలో కొన్ని స్టాండర్డ్ రూల్స్ తీసుకురాకపోతే అది కొత్త ప్రమాదాలను సృష్టించే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ అంటోంది.
యూరోపియన్ యూనియన్ ఏఐ పర్యవేక్షణకు సంబంధించిన చట్టాన్ని రూపొందిస్తోంది. అలాగే ఇప్పటివరకూ ఏఐ ఇండస్ట్రీల్లో 80 శాతం పెట్టుబడులను అమెరికా, చైనా దేశాలే పెట్టాయి. ఏఐ మార్కెట్ అతి కొద్ది దేశాల చేతిలోకి వెళ్లిపోకుండా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఏఐ వాడకం పెరిగేకొద్దీ సైబర్ చట్టాల మాదిరిగా ఏఐ నిబంధనలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
జీపీటీ 4
మొదట్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న చాట్ జీపీటీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లోకి వచ్చింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌కు ‘చాట్‌జీపీటీ ప్లస్’ అని పేరు పెట్టారు. సబ్‌స్క్రిప్షన్‌తో లేటెస్ట్ మోడల్ ‘జీపీటీ4’తో సహా అన్నిరకాల చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. మనదేశంలో చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్ 20 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1650గా ఉంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మరింత ఈజీగా, ఫాస్ట్‌గా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. వెబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా జీపీటీ4 ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇందులో యూజర్ల ప్రశ్నలకు వేగంగా స్పందించే ‘టర్బో ఆప్టిమైజ్డ్ లాంగ్వేజ్ మోడల్’ ఉంటుంది. ఇందులో ఫొటో, వీడియోకు సంబంధించిన టూల్స్ కూడా ఉన్నాయి. అయితే రిక్వెస్టులు ఎక్కువగా ఉండడం వల్ల సబ్‌స్క్రిప్షన్ కోసం వెయిట్ లిస్ట్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. త్వరలోనే తక్కువ ధరల్లో మరిన్ని ప్లాన్స్ తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సంస్థ చెప్తోంది.
ఏఐ సెర్చ్
చాట్‌జీపీటీ రాకతో సెర్చ్ ఇంజిన్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో సెర్చ్ ఇంజిన్లు కూడా ఏఐ టూల్స్‌గా మారిపోతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను యాడ్ చేసింది. దీనిద్వారా ఇంటర్నెట్ సెర్చ్ రూపంలో కూడా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. అయితే, ఈసేవలు ప్రస్తుతం వెయిట్ లిస్ట్ ప్రాసెస్‌లో అందిస్తున్నారు. అలాగే గూగుల్ ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ ‘బార్డ్’ను ప్రకటించింది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న బార్డ్ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ::: తిలక్
