
తమిళ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంతటి సక్సెస్ అయ్యిందో మనందరికి తెలుసు. 2016లో చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ దాదాపు 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూసేసారు ఆడియన్స్.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కుతోంది. మొదటి భాగంలో హీరోగా నటించిన హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈసారి దర్శకత్వ భాద్యతలు కూడా ఆయనే తీసుకున్నాడు. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ విజువల్స్, అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్సెస్, టచింగ్ ఎమోషన్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ లో కనిపించాయి. విజయ్ ఆంటోనీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.
బిచ్చగాడు మొదటి పార్ట్ లో మదర్ సెంటిమెంట్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక రెండో పార్ట్ కోసం సిస్టర్ సెంటిమెంట్ ని వాడేస్తున్నాడు విజయ్. స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న బిచ్చగాడు 2 ట్రైలర్, సినిమాపై అంచనాలని అమాంతం పెంచిసింది. మే 19న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎలాంటి అనుభూతిని మిగిల్చనుందో చూడాలి మరి.