డిసెంబర్‌‌‌‌ లాస్ట్ వీక్‌‌ నుండి ఖుషీ షూటింగ్!

డిసెంబర్‌‌‌‌ లాస్ట్ వీక్‌‌ నుండి ఖుషీ షూటింగ్!

‘లైగర్‌‌‌‌’ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్ను కోరి, మజిలీ లాంటి లవ్‌‌ స్టోరీస్‌‌తో ఆకట్టుకున్న శివ.. విజయ్, సమంత జంటతోనూ ఓ ఫీల్‌‌ గుడ్‌‌ లవ్‌‌ స్టోరీ తీస్తున్నాడు. సమంత హెల్త్ ఇష్యూస్‌‌తో ఈ మూవీ షూటింగ్‌‌కి బ్రేక్ పడింది. అయితే డిసెంబర్‌‌‌‌ లాస్ట్ వీక్‌‌ నుండి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ‘మయోసైటిస్‌‌’కు ట్రీట్మెంట్‌‌ తీసుకుంటోన్న సమంత.. డిసెంబర్‌‌‌‌ ఎండింగ్‌‌కు కొంత క్యూర్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే అరవై శాతం పైగానే షూటింగ్ పూర్తయింది కనుక వీలయినంత త్వరగా మిగతా షెడ్యూల్స్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో రిలీజ్‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు షూటింగ్‌‌కి గ్యాప్ రావడంతో కొత్త కథలు వినడంపై ఫోకస్ పెట్టాడు విజయ్. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా ఇదే విజయ్ తర్వాతి సినిమా కానుంది.