విజయ్- సుకుమార్ ల సినిమాపై కొత్త అప్టేడ్?

విజయ్- సుకుమార్ ల సినిమాపై కొత్త అప్టేడ్?

‘పుష్ప’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు డైరెక్టర్ సుకుమార్. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తాను ఓ సినిమా చేయనున్నట్లుగా ప్రకటించి చాలా రోజులే అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేకపోయింది. కనీసం దీనిపై ఎక్కడా వార్తలు కూడా వినిపించడం లేదు. దీంతో ఈ సినిమా లేనట్టే అంటూ ఇటీవల కొన్ని వార్తల వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ అభియానులు అప్ సెట్ అవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇవన్నీ రూమర్లేనని తెలుస్తోంది. కచ్చితంగా వీరిద్దరి కాంబో ఉండనుందని ప్రొడక్షన్ వర్గాలు స్పష్టం చేసినట్టు సమాచారం. 

అటు సుకుమార్ సైతం పుష్ప 2తో బీజీగా ఉన్నాడు. ఈ పనులన్నీ పూర్తి కాగానే వెంటనే వీరిద్దరి సినిమా మొదలు పెట్టనున్నారట. సుకుమార్ లాంటి మాస్ కమ్ క్లాస్ డైరెక్టర్ విజయ్ లాంటి హీరోతో సినిమా తీస్తున్నాడంటే అంచనాలు భారీగానే ఉంటాయి మరి. ప్రస్తుతం సమంత, విజయ్ ల ఖుషీ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. మహానటి తర్వాత వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. రెండు వేరు వేరు ప్రపంచాలు గల ఇద్దరు వ్యక్తులు ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందనేది దీని నేపథ్యం. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఖుషీ ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ తో  సినిమాలను సైతం ఈ హీరో లైన్ లో పెట్టాడు.