ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సరికొత్త ఏజెంటిక్ కామర్స్ సేవల కోసం గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పైన్ ల్యాబ్స్ పీ3పీ, గ్రాంటెక్స్ ప్రోటోకాల్ ఆధారంగా ఎల్టీఎఫ్ ప్లానెట్ యాప్‌లో ఏజెంటిక్ స్టోర్ ఫ్రంట్ అందుబాటులోకి వస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద విమాన టిక్కెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించారు. ఏఐ ఏజెంట్లే యూపీఐ సాయంతో టికెట్లనూ బుక్చేస్తాయి. త్వరలోనే మరిన్ని విభాగాలకు ఈ ఏఐ ఆధారిత సేవలను విస్తరిస్తామని ఎల్టీఎఫ్తెలిపింది.
మెక్డొవెల్స్కు విజయ్ ప్రచారం..
బ్రాండ్ హౌస్ ఆఫ్ మెక్ డొవెల్స్ సోడా స్నేహానికి సరికొత్త నిర్వచనం చెబుతూ ‘యారీ కీ నయీ వైబ్’ అనే తాజా ప్రచారాన్ని మొదలుపెట్టింది. తమ దీర్ఘకాల బ్రాండ్ అంబాసిడర్ అయిన నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఈ సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. కేవలం స్నేహితులతో కలిసి సమయం గడపడానికే పరిమితం కాకుండా, ప్రతి కలయికను జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకునే కొత్త తరం ఆలోచనలను ఈ యాడ్ ప్రతిబింబిస్తుంది.
హ్యామ్లీస్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం
రిలయన్స్‌కు చెందిన బొమ్మలకంపెనీ హ్యామ్లీస్ హైదరాబాద్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. నగరంలో ఇది సంస్థకు పదో స్టోర్. మూడు అంతస్తుల్లో పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు.చిన్నారులతోపాటు కుటుంబ సభ్యులనూ ఆకట్టుకునేలా పది వేలకుపైగా రకాల బొమ్మలు, ఆట వస్తువులు, బహుమతులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. హ్యామ్లీస్ ఫ్యామిలీకి చెందిన టాయ్ సోల్జర్, పైరేట్స్, హ్యామ్లీ, హ్యాటీ వంటి పాత్రలు ఆకట్టుకున్నాయి.
