V6 News

వరకట్న వేధింపా? ఆస్తి తగాదానా?..విజయారెడ్డి కేసులో ముదురుతున్న వివాదం

వరకట్న వేధింపా? ఆస్తి తగాదానా?..విజయారెడ్డి కేసులో ముదురుతున్న వివాదం
  • డీజీపీని ఆశ్రయించిన భర్త సురేందర్​రెడ్డి

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో మూడు నెలల కింద విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఫిర్యాదులతో కొత్త మలుపు తిరుగుతోంది. తొలుత విజయారెడ్డి ఆత్మహత్యకు భర్త సురేందర్​రెడ్డి వరకట్న వేధింపులే కారణమని ఆమె తరఫు బంధువులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా సురేందర్​రెడ్డి ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు.

తన అత్త, బామ్మర్ది కలిసి ఇంటి ఆస్తి పత్రాలు, బంగారం, నగదు తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఆయన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన డీజీపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీనిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదవగా, వరకట్న వేధింపుల ఆరోపణలు ఒకవైపు, ఆస్తి వివాదాలు మరోవైపు తలెత్తడంతో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.