
వికారాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులకు అండగా నిలుస్తోందని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం భరోసా కేంద్రం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గృహ హింస, లైంగిక వేధింపులు, ఇతర సమస్యలతో వచ్చేవారికి ఈ కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తోందని తెలిపారు. బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో ఇక్కడి సిబ్బంది పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. బాధిత మహిళలకు విక్టిమ్ అస్సిస్టెంట్ ఫండ్ కింద ఆర్థికసాయం చెక్కులు అందించారు. అడిషనల్ఎస్పీలు హనుమంతరావు, మురళీధర్, డీఎస్పీలు, భరోసా కేంద్రం కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.