వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రత్యేక అవసరాలు గల(దివ్యాంగులైన) పిల్లలకు ఉచిత సహాయక ఉపకరణాల కోసం అర్హుల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు.
అలింకో సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరానికి 18 ఏండ్లలోపు వయసున్నవారు హాజరుకావచ్చన్నారు. ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డ్, రేషన్/ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
