
రామ్ (రామ్ చరణ్) అనాథ. అతడిని మరో నలుగురు అనాథలు చేరదీస్తారు. భయస్తులైన ఆ నలుగురికి ధైర్యం అవుతాడు రామ్. వారి జోలికి ఎవరొచ్చినా అంతు చూస్తాడు. నలుగురి పెళ్లిళ్లతో అదో పెద్ద కుటుంబం అవుతుంది. సీత (కియారా)తో రామ్ పెళ్లి కుదురుతుంది. పెద్దన్నయ్య భువన్ కుమార్ సిన్సియర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్. మిగతావారు అతనితో పాటే. అన్నల జోలికి ఎవరొచ్చినా ఆటాడేసుకునే రామ్.. ఓసారి పందెం పరశురామ్‌ని ఢీకొడతాడు. మరోవైపు బీహార్‌లో ఎన్నికలకు అడ్డుపడిన రాజా భాయ్ మున్నా (వివేక్ ఒబెరాయ్)ను ఎదిరించబోయి ఇబ్బందుల్లో పడతాడు భువన్. తన టీమ్‌తో సహారాజా భాయ్ చెరలో చిక్కుకుంటారు. వారిని రామ్ ఎలా కాపాడాడు, ఆ క్రమంలో ఏం జరిగిందనేది మిగతాకథ. ఎవరెలా..యాక్షన్ ఎపిసోడ్స్‌లో మునుపెన్నడూ లేనంత పవర్ ఫుల్ గా కనిపించాడు చరణ్. సిక్స్ ప్యాక్ లుక్, డైలాగ్ డెలివరీ అభిమానులను అలరిస్తుంది. కియారా పాత్ర పాటల కోసమే అన్నట్టు గా ఉన్నప్పటికీ గ్లామర్‌తో ఆకట్టుకుంది.చరణ్ వంటి మాస్ హీరోకు తగ్గ పవర్ ఫుల్ విలనిజం ప్రదర్శించాడు వివేక్ ఒబెరాయ్. ప్రశాంత్ , స్నేహలవి ప్రాధాన్యత కలిగిన పాత్రలే అయినా ఆసక్తికరంగా లేవు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా హేమ నవ్వించింది. ఆర్యన్ రాజేశ్, రవి వర్మ, మధు నందన్ మిగతా అన్నలుగా కనిపించారు. పందెం పరశురామ్‌గా ముఖేశ్ రుషిమెప్పించాడు. సినిమాలో చాలా పాత్రలున్నప్పటికీ స్క్రీన్ నిం డుగా కనిపిం చడం కోసమే అన్నట్టు గా ఉన్నాయి. పాటల విషయంలో మెప్పించలేకపోయిన దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టు సాగింది. నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు నిర్మా త దానయ్య.