సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం

సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం

బషీర్​బాగ్, వెలుగు: లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతిని పురస్కరించుకొని బుధవారం బేగంబజార్ బెహతి భవనంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. 46వ సామూహిక గణేశ్ నిమజ్జన ఉత్సవాలను సెప్టెంబర్ 6న (అనంత చతుర్దశి) ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డా. రావినూతల శశిధర్ తెలిపారు. ఆగస్టు 27న వినాయక చవితి ఉండగా, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 

హిందూ ధర్మంపై కుట్రలను తిప్పికొట్టేందుకు హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. గణేశ్ ఉత్సవాల ద్వారా రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని, స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం కోసం కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాయకులు ఎమ్. రామరాజు, అలె భాస్కర్ ఉన్నారు.